pedicure at home: ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా.. – how to do pedicure at home with easy steps


పగిలిన పాదాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ఈ సమస్యతో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది చర్మ ఆరోగ్యాన్ని చూసుకుంటారు. కానీ, పాదాలను పట్టించుకోరు. శరీరాన్ని పట్టించుకుని పాదాలను వదిలేస్తే పగుళ్లు ఏర్పడి కొన్నిసార్లు అవి ఇన్ఫెక్షన్‌గా మారే అవకాశం ఉంది. కాలంతో సంబంధం లేకుండా పాదాలకు పగుళ్ళు ఏర్పడతాయి. వేడి నీరు, అధిక స్క్రబ్, చెప్పులు పాదాలు పగలటానికి కారణమవుతాయి. పాదాలు పగలడం వల్ల నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. మరియు అందవీహనంగా కనిపిస్తాయి.

పాదాల పగుళ్లకు అనేక కారణాలు ఉన్నాయి. డ్రై స్కిన్, ఎక్కువగా నడవడం, చెప్పులు లేకుండా నడవడం, పరుగెత్తడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పరిశుభ్రత పాటించకపోవడం వంటివి కూడా పాదాల పగుళ్లకు కారణమవుతాయి. అయితే ఈ పగిలిన పాదాలను ఎక్కువకాలం పట్టించుకోకపోతే, త్వరగా నయం చేసుకోకపోతే.. ఇతర సమస్యలకు కారణమవుతాయి. పాదాలు పగుళ్లు లేకుండా మృదువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మృదువైన పాదాలను కలిగి ఉండాలనుకుంటున్నారా? దీనికోసం మార్కెట్ లో లభించే ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల పాదాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకే పగిలిన పాదాలకు రసాయన ఉత్పత్తుల కన్నా వంటగదిలో లభించే పదార్ధాలను ఉపయోగించి అద్భుతమైన పెడిక్యూర్ ను ఇంట్లోనే చేసుకోండి. దీంతో అందమైన , మృదువైన పాదాలను పొందండి.

Also Read : బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా..

పాదాల పగుళ్ల కోసం భారతదేశంలోని స్కీన్‌డోర్ కాస్మోటాలజిస్ట్, హెడ్ ట్రైనర్ ప్రియాంక త్యాగి కొన్ని టిప్స్ చెబుతున్నారు. వాతావరణ మార్పులు, వేడి నీళ్ల స్నానం, ఎక్కువసేపు వేడి నీటిలో పాదాలు ఉంచడం, ఎక్కువ స్క్రబ్, చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా పగుళ్లు ఏర్పడతాయని ఆమె వివరించారు. కఠినమైన రసాయనాలను, శరీరం హైడ్రేటెడ్ గా లేకపోతె పాదాల పగుళ్లకు కారణంగా ఉంటుందని చెబుతున్నారు.

ఆమె సూచించిన ప్రాథమిక విషయం ఏంటంటే, పాదాలు పొడిగా ఉంటే పగిలే అవకాశం ఉందని అందుకే ఎక్కువగా నీరు తాగాలని దాని వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుందని ఆమె సూచించారు. అందుకే నీరు ఎక్కువ తాగడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. అందుకే నీరు ఎక్కువగా తాగి హైడ్రేటెడ్ గా ఉండండం ముఖ్యం.

చాలా మందికి పాదాలు పొడిగా ఉంటాయి. అయితే, వారు దానికోసం పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అనేక అనేక మంది ఫుట్‌కేర్‌పై పెద్దగా శ్రద్ధ వహించారు. చాలా మంది స్నానం చేసిన తరువాత ముఖానికి, మీదకి చేతులు తేమగా ఉండటానికి మొయిశ్చరైజర్ ఉపయోగించారు. కానీ పాదాలకు మొయిశ్చరైజర్ వాడరు . దీని వల్ల పాదాలు పొడి బారే అవకాశం ఉంది. పాదాలు పొడిగా ఉంటే పగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాదాలు పొడిగా కాకుండా తేమగా ఉండటానికి మంచి మార్గం ఒకటి ఉంది.. అది ఏంటంటే స్నానం చేసిన తర్వాత పాదాలు తేమగా ఉండటానికి వాజిలిన్, కొబ్బరి నూనె రాస్తే పాదాలు తేమగా ఉంటాయి. ఇలానే మరికొన్ని ఇంటి చిట్కాలతో పాదాలను కాపాడుకోండి.

Also Read : నానబెట్టిన బాదం మంచిదా.. అలానే తినడం మంచిదా..

పాదాలను తేమగా ఉంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో ఏ కాలంలోనైనా లభించే ఔషధం అరటిపండు. అరటిపండు పాద రక్షణకు గొప్పగా ఉపయోగపడతాయి. ఈ పండు మీ పాదాలను తేమగా ఉంచడానికి సాయపడుతుంది. అరటిపండు పొడి బారిన పాదాలకు తేమను తిరిగి ఇవ్వడానికి వాడాలని నేషనల్ స్కిన్ సెంటర్ డైరెక్టర్ నవీన్ తనేజా సలహా ఇస్తున్నారు.

అరటిపండుతో అందమైన పాదాలు..

ఒక అరటిపండు గుజ్జు తీసుకొని దాన్ని పేస్ట్‌లా చేసి మీ పాదాలకు రాయండి. ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల వరకు ఉంచి, తరువాత నీటితో మీ పాదాలను శుభ్రం చేసుకోవాలి. అరటిపండు రాయడం వల్ల పాదాలు తేమగా మారతాయి. దీని వల్ల పాదాలు పగిలే అవకాశాలు తక్కువ.

అంతర్జాతీయ మేకప్ నిపుణుడు, ఎల్‌పిఎస్ బ్యూటీ క్లినిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషికా తనేజా పాదాలకు నిమ్మకాయకు అద్భుతంగా పని చేస్తుంది. పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే పాదాలకు చెప్పులు లేకుండా నడిచేటప్పుడు నేలపై ఉండే క్రిములు పాదాలకు ఉండిపోతాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. పాదాలను ఎప్పటికప్పుడు స్క్రబ్ చేయడం వల్ల పాదాలపై ఉండే మృత చర్మం తొలగిపోతాయి. అయితే ఇందుకోసం మీరు చేయాల్సిందల్ల క్రమం తప్పకుండా ఇంట్లోనే పెడి క్యూర్ చేసుకోవడం. దీని కోసం మీకు కావాల్సిందల్లా నిమ్మకాయి, గ్లిజరిన్, జొజోబా ఆయిల్.

Also Read : కర్పూరం రాస్తే జుట్టు పెరుగుతుందా..

గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొన్ని చుక్కల జోజోబా నూనెను వేసి మీ పాదాలను కొంత సేపు నీటిలో ఉంచండి . తరువాత తేలికపాటి స్క్రబ్ తో పాదాలను స్క్రబ్ చేయండి. దీని వల్ల మీ పాదాలపై ఉండే మృత చర్మాన్ని తేలికగా స్క్రబ్ చేయవచ్చు. నిమ్మకాయ కొద్దిగా ఆమ్లంగా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మీ పాదాలను గ్లిజరిన్ తో మృదువుగా మసాజ్ చేసి సాక్స్ ను ధరించండి.

పాదాలకి మాస్క్..

ఈ మాస్క్ తయారీ కోసం రసాయన పదార్ధాలు, ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. వంటగది పదార్థాలను ఉపయోగించి సులువుగా పాదాలకు మాస్క్ ను తయారు చేసుకోవచ్చు. దీని కోసం “రెండు టేబుల్ స్పూన్ల అవోకాడో పేస్ట్ ను అర కప్పు మయోనైస్, రెండు టేబుల్ స్పూన్ల వోట్‌మీల్ ను బాగా కలపండి . ఈ పేస్ట్‌ని పాదాలకు రాసి అరగంట వరకు ఉంచండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసి , పాదాలను ఆరనివ్వండి

ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మీ పాదాల పగుళ్ళు తగ్గి మృదువుగా మారతాయి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *