Petrol price: నిలకడగానే పెట్రోల్, డీజిల్ ధరలు! – petrol diesel rate in hyderabad today 2nd june 2020 and across metro cities


ప్రధానాంశాలు:

  • స్థిరంగానే పెట్రోల్ ధర
  • డీజిల్ ధరదీ ఇదే దారి
  • మిశ్రమంగా క్రూడ్ ధరలు

దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.74.61 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.21 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది.

Also Read: SBI నుంచి లోన్ తీసుకున్నారా? ఆ తప్పు చేస్తే రూ.లక్షల్లో నష్టం.. జాగ్రత్త!

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.71.26 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.69.39 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.76.31 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.66.21 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

Also Read: బంగారం ధర పరుగు.. వెండి జిగేల్.. ఈరోజు రేట్లు ఇవే!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.31 శాతం తగ్గుదలతో 38.47 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.25 శాతం పెరుగుదలతో 35.52 డాలర్లకు చేరింది.

ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *