Petrol price: పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈరోజూ అదే ట్రెండ్! – petrol diesel rate in hyderabad today 4th june 2020 and across metro cities


ప్రధానాంశాలు:

  • స్థిరంగానే పెట్రోల్ ధర
  • డీజిల్ ధరదీ ఇదే దారి
  • మిశ్రమంగా క్రూడ్ ధరలు

దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.74.61 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.21 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది.

Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. భారీగా పతనమైన వెండి!

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.71.26 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.69.39 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.76.31 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.66.21 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

Also Read: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. లోన్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు కట్టక్కర్లేదు!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.05 శాతం పెరుగుదలతో 39.41 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.53 శాతం తగ్గుదలతో 36.72 డాలర్లకు క్షీణించింది.

ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *