porn viewers in lockdown : ఫోన్లలో పోర్న్ చిత్రాలు.. దిమ్మతిరిగే ప్లేస్‌లో భారత్.. లాక్‌డౌన్‌లో అదే పని! – porn sites gets high boost and india reports 95 per cent rise in porn content


Samayam Telugu | Updated:

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతుంది. దీనిపై పోరాడేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. భారత ప్రభుత్వం కూడా తొలుత విధించిన 21 రోజుల లాక్ డౌన్‌ను మే 3 వరకూ పొడిగించింది. దీంతో ప్రజలంతా ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. అందులో చాలా మంది తమ ఫోన్లకే అంకితమై, దానితో కాలక్షేపం చేస్తున్నారు. అయితే, అందులో ఏం చూస్తున్నారు? అనేది తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో తేలింది. వివిధ వర్గాల వారు తమకు వయసును బట్టి ఆసక్తికరమైన కంటెంట్‌ను ఫోన్‌లో చూస్తున్నా.. మొత్తం కలిపి సరాసరిన ఏ రకం కంటెంట్ అత్యధికంగా చూస్తున్నారో ఆ సంస్థ సర్వేలో వెల్లడించింది. తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే.. ఫోన్లో చాలా మంది చూసేవి మాములు చిత్రాలు కాదట.. ఎక్కువ మంది నీలి చిత్రాలు చూస్తున్నట్లుగా తేలింది. ప్రపంచంలోనే ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ అయిన ‘పోర్న్ హబ్’ విడుదల చేసిన తాజా లెక్కలివీ.

ఫ్రీ ప్రీమియం ఆఫర్లు కూడా!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఫీవర్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతుంటే.. పోర్న్ సైట్లు మాత్రం దాన్ని క్యాష్ చేసుకొనే దిశగా ప్రయత్నిస్తున్నాయి. పోర్న్ హబ్ సంస్థ తమ వీక్షకులను పెంచుకొనేందుకు ఓ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కాలక్షేపం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తూ పోర్న్ చూసే వైపు మొగ్గుతున్నారని తమ పరిశీలనలో తేలినట్లుగా ఆ సైట్ ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. వీరిలో ఎక్కువగా యువతే ఉంటున్నట్లుగా వెల్లడించింది. అయితే, వీరిని ఆకట్టుకొనేందుకు పోర్న్‌ హబ్ ప్రీమియం సబ్స్‌క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోందని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.

Must Read: కండోమ్‌ల కొరత కలవరం.. లాక్‌డౌన్‌ వేళ విపరీత గిరాకీ, యూఎన్ సైతం ఆందోళన





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *