potato juice during workout: ఎక్సర్‌సైజ్ చేసేవారు ఈ జ్యూస్ తాగితే చాలు ఎన్నో లాభాలు.. – how a potato can fuel your workouts know here


ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆలుగడ్డలను ఎక్కువగా తినరు. ఎందుకంటే, ఇవి కీళ్ల నొప్పుల వంటి సమస్యలను తీసుకువస్తాయని, వీటివల్ల అధిక బరువు పెరుగుతారని అనేక మంది భావిస్తారు. అందువల్ల వీటిని రోజువారీ ఆహారంలో పెద్దగా ఉపయోగించరు. అయితే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వీటిలో అధికంగా ఉండే గ్లైసెమిక్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం బంగాళ దుంపలు తినడం వల్ల ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచించారు. వర్కవుట్స్ చేసే టైమ్‌లో ఆలు జ్యూస్‌ను తీసుకుంటే అథ్లెటిక్ పనితీరును పెంచడానికి సాయపడుతుందని అధ్యయనంలో తేలింది. వ్యాయామం చేసేటప్పుడు బంగాళాదుంపను జ్యూస్‌గా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్‌ను సరైన స్థాయిలో ఉంటాయి.

Also Read : రోజూ శ‌ృంగారం చేస్తున్నారా.. ఏమవుతుందంటే..

ఎక్కువ సమయం సైక్లింగ్ చేయటానికి కార్బోహైడ్రేట్ జెల్స్ ఎలా తోడ్పడతాయో, బంగాళ దుంపలు వల్ల కూడా అన్నే లాభాలు ఉంటాయని జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం, 12 మంది పరిశోధకులని నియమించారు. వీరంతా తమ స్పోర్ట్స్ లైఫ్‌కి అంకితమైనవారు. వారు వారానికి సైక్లింగ్ లో 165 మైళ్ళు సగటున చేస్తారు. ఈ అధ్యయనంలో పాల్గొనే వారంతా తమ క్రీడలో సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్నారు. ట్రయల్స్ కు అర్హత సాధించిన వారు. సైక్లిస్టులు ఏరోబిక్ ఫిట్‌నెస్ కోసం ఓ నిర్దిష్ట స్థాయిని చేరుకోవాలి. 120 నిమిషాల సైక్లింగ్ ఛాలెంజ్‌ని అనుకున్న సమయంలో పూర్తి చేయాలి. ఈ పరిశోధనలో పాల్గొనే వారు వ్యాయామం చేసేటప్పుడు ఇప్పుడు చెప్పే మూడు పనులలో ఏదైనా చేయమని చెప్పారు. అవి నీరు తాగడం, కార్బోహైడ్రేట్ జెల్, బంగాళాదుంపల కార్బోహైడ్రేట్ల సమానమైన మొత్తాన్ని తినమని కోరారు.

Also Read : టూత్ పేస్టు ఇలా వాడకపోతే అంతే.. అసలు ఎంత వాడాలి

ఇందులో పాల్గొన్న వారిని సైక్లింగ్‌ని స్టార్ట్ చేయమని అడిగే ముందు, పాల్గొనేవారు ఒక రోజు ఏమి తిన్నారో పరిశోధకులు పర్యవేక్షించారు. పాల్గొనేవారి రక్తంలో గ్లూకోజ్, ప్రధాన శరీర ఉష్ణోగ్రత, వ్యాయామ తీవ్రత, జీర్ణశయాంతర లక్షణాలు, లాక్టేట్‌ గురించి ఓ పట్టికగా రాసుకున్నారు. వ్యాయామం చేసేటప్పుడు కార్బోహైడ్రేట్ జెల్ తినే సైక్లిస్టుల పనితీరులో, బంగాళ దుంప జ్యూస్ తాగిన వారి పనితీరులో తేడా లేదని వారు గమనించారు. ఈ పరిశోధనని జరిపిన యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ కైనేషియాలజీ, కమ్యూనిటీ హెల్త్ ప్రొఫెసర్ నికోలస్ బర్డ్ మాట్లాడుతూ, వర్కవుట్ టైమ్‌లో కార్బోహైడ్రేట్ జెల్‌ను తీసుకోవడం కార్బోహైడ్రేట్ లభ్యతను ప్రోత్సహిస్తుందని, ఈ కారణంగా వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలింది. సుదీర్ఘమైన వ్యాయామంలో బంగాళాదుంప పురీని తీసుకోవడం అథ్లెటిక్ పనితీరును పెంచడానికి సహాయపడుతుందని అధ్యయనం తెలిపింది.

Also Read : పొట్టపై నూనెతో మసాజ్ చేస్తే పిల్లలు పుడతారా..

“మా అధ్యయనం యొక్క లక్ష్యం అథ్లెట్స్ ఎంపికలను విస్తరించడం, వైవిధ్యపరచడం, వారి అలసటను తగ్గించడం. బంగాళ దుంపలు అథ్లెట్స్‌కి మంచి ప్రత్యామ్నాయం, ఎందుకంటే అవి కార్బోహైడ్రేట్స్‌ని తక్కువ ఖర్చులో, అధిక పోషణ, పూర్తి-ఆహార వనరులను సూచిస్తాయి. బంగాళ దుంపలతో పోలిస్తే జెల్స్‌ ఎక్కువ తియ్యగా ఉంటాయి, వాటికీ సమానంగా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఏదేమైనా, బంగాళ దుంప జ్యూస్ ని తాగేవారు కార్బోహైడ్రేట్ జెల్స్‌ను తినే వారితో పోలిస్తే మిగతా చాలా ఎక్కువ ఉబ్బరం, నొప్పుల వంటి సమస్యలు అనుభవించారని పరిశోధకులు గుర్తించారు. జెల్స్ అందించిన గ్లూకోజ్‌తో సరిపోలడానికి అవసరమైన పెద్ద బంగాళాదుంపలు కావాలని బర్డ్ చెప్పారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *