punjab girl murder: డబ్బున్న అమ్మాయిని ముగ్గులోకి దించి దారుణం.. తల, చేతులు నరికేసి.. ఏడాది తర్వాత వీడిన మిస్టరీ – up police reveals shocking facts in punjab girl beheaded mystery


పొలాల్లో తల లేని యువతి శవం తీవ్ర కలకలం రేపింది. ఆమె రెండు చేతులు కూడా నరికేసి ఉన్నాయి. ఆ శవాన్ని చూసి భయపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించారు. స్పాట్‌లో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆమె తల, కనీసం చేతులు కూడా లేకపోవడంతో ఆమె ఎవరో తెలుసుకోవడం మిస్టరీగా మారింది. కనీసం వేలిముద్రలు కూడా దొరకని పరిస్థితి. ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం.. ఆధారాలు లభించకుండా హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నారు. అసలు ఆ యువతి ఎవరు? ఆమెను దారుణంగా హత్య చేసి అక్కడ ఎందుకు పడేశారు? తల, చేతులు వేరుచేయాల్సినంత అవసరం ఏముంటుంది? అనే విషయాలు తెలుసుకునేందుకు తీవ్రంగా శోధించారు. కానీ ఎక్కడా లింక్ దొరకలేదు. చివరికి ఒక చిన్న క్లూ రాష్ట్రాలు దాటి మరీ మర్డర్ మిస్టరీని ఛేదించేలా చేసింది. అదీ ఏడాది తర్వాత. ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేయడంతో అసలు నిజాలు కక్కేశాడు.

​యూపీ టు లుధియానా..

samayam telugu

యువతి హత్య కేసు నమోదు చేసిన పోలీసులకు ఓ సెల్‌ఫోన్ నంబర్ క్లూ దొరికింది. స్పాట్‌లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఓ నంబర్ సేకరించారు. ఆ నంబర్ పంజాబ్‌లోని లుధియానాకి చెందినదిగా గుర్తించారు. యూపీలో హత్య జరిగిన ప్రదేశంలో లుధియానా నంబర్ చూపడంతో అనుమానం వచ్చిన పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా లుధియానా వెళ్లిన పోలీసులకి షాకింగ్ విషయం తెలిసింది. ఏడాది కిందట ఓ యువతి మిస్సింగ్ కంప్లైంట్ రావడం.. అందులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో పోలీసులు అనుమానాలు బలపడ్డాయి.

Also Read: ముళ్లపొదల్లో మహిళ మృతదేహం.. ప్రియుడిని పట్టించిన ‘పర్సు’

​ప్రియుడిది మీరట్..!

samayam telugu

యువతి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులను పిలిచి ఆరా తీయడంతో తమ కూతురు ఏడాది కిందట కనిపించకుండా పోయిందని చెప్పారు. ఆమె ప్రేమను నిరాకరించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుసుకుని ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు. ప్రియుడిని మీరట్‌కి చెందిన మహమ్మద్‌‌గా గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బున్న అమ్మాయిని ప్రేమపేరుతో వంచించి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఆధారాలు లభించకుండా ఉండేందుకు తల, చేతులు నరికేసినట్లు తేల్చారు.

​డబ్బున్న అమ్మాయితో ప్రేమలో దించి..

samayam telugu

ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతానికి చెందిన షాకిబ్ మహమ్మద్ తరచూ పంజాబ్‌‌లోని లుధియానాకి వెళ్తుండేవాడు. అక్కడ ఓ షాపులో పనిచేసేవాడు. నగరంలో పెద్ద ట్యాక్సీ సంస్థ నడుపుతున్న కుటుంబానికి చెందిన యువతి ఏక్తా జస్వాల్(19)తో పరిచయం పెంచుకున్నాడు. తన పేరు అమన్ అని.. హిందువునని నమ్మించాడు. అమన్‌తో పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోవడంతో ఆమె ఇంటి నుంచి పారిపోయింది. ప్రియుడితో పారిపోయే సమయంలో సుమారు రూ.25 లక్షల విలువైన బంగారం, నగదు తీసుకెళ్లింది. ఇద్దరూ మీరట్‌లోని డౌరాలాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కలసి ఉంటున్నారు.

Read Also: కోవిడ్ ఆస్పత్రిలో కామపిశాచి.. లేడీ డాక్టర్ నోరుమూసి.. దారుణం

​హిందూ కాదని తెలిసిపోవడంతో..

samayam telugu

ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న జస్వాల్‌కి ప్రియుడు అమన్‌పై అనుమానం వచ్చింది. అతను హిందూ కాదని.. ముస్లిం అని గ్రహించింది. అతను అమన్ కాదని.. మహమ్మద్ అని తెలియడంతో నిలదీసింది. అదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ప్రియురాలని ఎలాగైనా అడ్డుతొలగించుకుని డబ్బు, నగలు కాజేయాలని భావించిన ప్రియుడు.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. గతేడాది జూన్‌లో ఈద్ రోజున కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ‌ కోల్పోయాక దారుణంగా హతమార్చాడు. ప్రియురాలి ఆచూకీ తెలియకూడదని మొండెం నుంచి తలను వేరుచేశాడు. ఆమె చేతిపై ప్రియుడి పేరు పచ్చబొట్టు ఉండడంతో చేతులు కూడా నరికేసి వేరేచోట పడేశాడు.

​సోషల్ మీడియాలో జస్వాల్ పేరుతో..

samayam telugu

నమ్మి వచ్చిన యువతని దారుణంగా హత్య చేసిన మహమ్మద్ కొత్త నాటకానికి తెరతీశాడు. ఆమె చనిపోయినట్లు తెలిస్తే తన బండారం బయటపడుతుందని భావించి మాస్టర్ ప్లాన్ చేశాడు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు జస్వాల్ బతికే ఉందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె ఫోన్ తన వద్దే ఉంచుకుని తన సోషల్ మీడియా అకౌంట్లలో పాత ఫొటోలను అప్‌లోడ్ చేస్తుండేవాడు. వాట్సాప్‌ స్టేటస్, ఫేస్‌బుక్ వంటి ఖాతాల్లో జస్వాల్ అకౌంట్ నుంచి పోస్టులు పెడుతుండేవాడు. అవి చూసిన బంధువులు ఎక్కడో ఆమె బతికే ఉందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు దొరికిపోయాడు.

Also Read: కొత్త కోడలిపై కన్నేసిన మామ.. ఒంటరిగా ఉన్న సమయం చూసి..

​పోలీసు తుపాకీ లాక్కుని పారిపోయే యత్నం..

samayam telugu

ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా యువతి తల, చేతులు పడేసిన చోటుకి తీసుకెళ్లారు. వివరాలు సేకరిస్తున్న సమయంలో అదను చూసి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు నిందితుడు. ఏకంగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ తుపాకీ లాక్కుని బెదిరించడంతో పోలీసులు తుపాకులకు పనిచెప్పారు. పారిపోతున్న నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు యువతి హత్యకు సహకరించిన అతని కుటుంబ సభ్యులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

​కడుపుమండి ప్రెస్‌మీట్‌లోనే దాడి..

samayam telugu

యువతి అదృశ్యం, హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితులను ప్రెస్‌మీట్‌లో హాజరుపరిచారు. హత్య వివరాలు తెలియజేశారు. తమ కూతురిని ప్రేమపేరుతో ముగ్గులోకి దించి దారుణంగా హత్య చేసిన నిందితుడిపై జస్వాల్ కుటుంబానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీస్ ప్రెస్‌మీట్‌లోనే నిందితుడిపై దాడికి పాల్పడింది. అడ్డుకున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. ఏడాది కిందట జరిగిన దారుణ హత్య కేసును ఎట్టకేలకు యూపీ పోలీసులు ఛేదించారు.

Also Read: మరిదితో వదిన రాసలీలలు.. భర్తకి దొరికిపోవడంతో..Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *