railways: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. కొత్త సర్వీసులు అందుబాటులోకి! – indian railways launches composite samagra app in bihar


ప్రధానాంశాలు:

  • కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ఇండియన్ రైల్వేస్
  • దీంతో ట్రైన్ సమాచారం సులభంగా పొందొచ్చు
  • టికెట్ బుకింగ్ దగ్గరి నుంచి ఎన్నో సర్వీసులు

ఇండియన్ రైల్వేస్ తాజాగా ప్రయాణికులకు తీపికబురు అందించింది. సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా ట్రైన్స్‌కు సంబంధించిన అన్ని వివరాలను సులభంగానే తెలుసుకోవచ్చు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే తాజాగా సమగ్ర యాప్‌ను లాంచ్ చేసింది.

ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్న వారు గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్‌ను సులభంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రైల్వే, ట్రైన్, స్టేషన్ ఫెసిలిటీస్, రైల్వే పాలసీ, టికెట్స్, డిస్కౌంట్స్ వంటి వివరాలను అన్నింటినీ తెలుసుకోవచ్చు.

Also Read: బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్.. ఖాతాదారులపై ఎఫెక్ట్!

ట్రైన్‌లో రిజర్వేషన్‌కు సంబంధించిన సమాచారం, ట్రైన్ ఎక్కడ ఉంది వంటి వివరాలను ఇంట్లో కూర్చొనే తెలుసుకోవచ్చు. జనరల్ మేనేజర్ ఎల్‌సీ త్రివేది ఈస్ట్ సెంట్రల్ రైల్వే హెడ్ ఆఫీస్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యాప్‌ను ఆవిష్కరించారు.

సమగ్ర యాప్ ద్వారా కేవలం ప్యాసింజర్లు మాత్రమే కాకుండా రైల్వే ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందొచ్చు. కమర్షియల్, టికెట్ చెకింగ్, టికెట్ బుకింగ్, రిజర్వేషన్ వంటి విభాగాలకు చెందిన డిపార్ట్‌మెంట్లకు కూడా ఈ యాప్ ద్వారా బెనిఫిట్ ఉంటుంది. కాగా ఇలాంటి యాప్ రానున్న రోజుల్లో మన సౌత్ సెంట్రల్ రైల్వేస్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *