SBI deposit rates: SBI కస్టమర్లకు భారీ షాక్.. 44 కోట్ల మంది ఖాతాదారులపై ఎఫెక్ట్! – state bank of india cuts savings bank deposit rates by 5 bps to 2.70%


ప్రధానాంశాలు:

  • వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్
  • సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు వర్తింపు
  • మే 31 నుంచి నిర్ణయం అమలులోకి

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చింది. మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో ఈ రేటు 2.7 శాతానికి దిగొచ్చింది. మే 31 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది.

స్టేట్ బ్యాంక్ తాజా నిర్ణయంతో బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బులపై ఇకపై తక్కువ రాబడి వస్తుంది. దీంతో దాదాపు 44 కోట్ల మంది బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం పడనుంది. అన్ని రకాల బ్యాంక్ ఖాతాలకు వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది.

Also Read: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి మాత్రం..

సాధారణంగా ఎస్‌బీఐ తన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు డు రకాల వడ్డీ రేట్లను అందిస్తుంది. రూ.లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలు ఒక రకం. రూ.లక్షకు పైగా బ్యాలెన్స్ కలిగిన అకౌంట్లు రెండో రకం. వీటికి గతంలో వేర్వేరు వడ్డీ రేట్లు వర్తించేవి. కానీ ఇటీవల నుంచి రెండు రకాల బ్యాంక్ ఖాతాలకు ఒకే రకమైన వడ్డీ రేటే వర్తిస్తోంది.

Also Read: బజాజ్ ఫైనాన్స్ బంపరాఫర్.. మరో 3 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు!

ఎస్‌బీఐ ఏప్రిల్ నెలలో కూడా సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అప్పుడు వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో అప్పుడు వడ్డీ రేటు 2.75 శాతానికి దిగొచ్చింది. అంతేకాకుండా ఎస్‌బీఐ మే 27 నుంచి టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లలో 40 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించింది. స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం ఒక నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

రేట్ల కోత నిర్ణయంతో 7 రోజుల నుంచి 45 రోజుల వ్యవధిలోని ఎఫ్‌డీలపై 2.9 శాతం వడ్డీ వస్తుంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 3.9 శాతం, 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీలపై 4.4 శాతం, 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం, ఏడాది నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.1 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.3 శాతం, 5 ఏళ్లు నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.4 శాతం వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *