sbi personal loan: SBI పర్సనల్ లోన్.. క్షణాల్లో అకౌంట్‌లోకి డబ్బులు! – how to apply for emergency loan from state bank of india


ప్రధానాంశాలు:

  • ఎస్‌బీఐ నుంచి ప్రిఅప్రూవ్డ్ రుణాలు
  • ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు
  • వెంటనే అకౌంట్‌లోకి డబ్బులు
  • ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ బెనిఫిట్

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో రుణాలు కూడా ఒక భాగంగానే చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎస్‌బీఐ తన కస్టమర్లకు ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందిస్తోంది. కరోనా వైరస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి స్టేట్ బ్యాంక్ ఈ ఎమర్జెన్సీ లోన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా బ్యాంక్ కస్టమర్లు తక్కువ వడ్డీకే అంటే 7.25 శాతం వడ్డీకే రుణం పొందొచ్చు. రెగ్యులర్ పర్సనల్ లోన్స్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ వడ్డీ రేటు అని చెప్పొచ్చు. వీటిపై వడ్డీ రేటు 10.5 శాతం నుంచి ప్రారంభమౌతుంది.

Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి షాక్!

ఎస్‌బీఐ ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది. మీరు కూడా మీ రుణ అర్హతను సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం ఒక్క ఎస్ఎంఎస్ పంపి రుణ అర్హత తెలుసుకునే అవకాశం అందుబాటులో ఉంది.

Also Read: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే?

Also Read: శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. కొత్త రేట్లు ఇవే!

మీరు మీ రుణ అర్హతను తెలుసుకోవాలంటే పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676కు ఎస్ఎంఎస్ చేయాలి. ఇప్పుడు మీరు లోన్‌కు అర్హులో కాదో తెలిసిపోతుంది. ఈ లోన్‌కు అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. వెంటనే లోన్ డబ్బులు అకౌంట్‌లోకి వచ్చేస్తాయి.

లోన్ కోసం అప్లై చేసుకోవాలంటే ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్రిఅప్రూవ్డ్ లోన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లోన్ టెన్యూర్, లోన్ అమౌంట్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. లోన్ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *