sbi warning: SBI వార్నింగ్.. అలా చేయొద్దంటూ కస్టమర్లకు హెచ్చరిక.. లేదంటే.. – state bank of india alert customer to beware of phishers cautious about communication on internet security measures to stay safe


ప్రధానాంశాలు:

  • పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలు
  • కస్టమర్లను అలర్ట్ చేస్తు్న్న ఎస్‌బీఐ
  • బ్యాంక్ నుంచి సేఫ్టీ టిప్స్

బ్యాంక్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో బ్యాంక్ కస్టమర్ల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. అకౌంట్‌ ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను హెచ్చరిస్తోంది.

మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలని ఎస్‌బీఐ తన కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. మోసాల బారిన పడకుండా ఉండేందుకు టిప్స్‌ అందిస్తోంది. అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకునేందుకు ఖాతాదారులకు సాయం చేస్తోంది.

Also Read: సుకన్య సమృద్ధి స్కీమ్‌తో చేతికి రూ.63 లక్షలు! ఎలా అంటే?

Also Read: మీ డబ్బుకు ఎక్కువ వడ్డీ అందిస్తున్న టాప్-10 బ్యాంకులు ఇవే!

కస్టమర్లు ఫిషింగ్ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని కోరింది. మోసాల బారిన పడకుండా ఉండాలంటే పలు టిప్స్ అనుసరించాలని తెలిపింది. వీటిని వీడియో రూపంలో తెలియజేస్తూ ట్వీట్ చేసింది.

Also Read: రూ.1,110తో కొత్త స్కూటర్ ఇంటికి తీసుకెళ్లండి.. మీ సిస్టర్‌కు అదిరిపోయే రక్షా బంధన్ గిఫ్ట్!

మోసగాళ్లు ఫిషింగ్ ద్వారా కస్టమర్ల నుంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, క్రెడిట్ కార్డు నెంబర్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ వివరాలు వంటి వాటిని తస్కరిస్తారు. ఈ సమాచారం సాయంతో బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు కొట్టేస్తారు.

ఈ నేపథ్యంలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు అది సురక్షితమైనాదా? కదా? అని చెక్ చేసుకోవలని ఎస్‌బీఐ సూచించింది. యూఆర్ఎల్ https: // నుంచి ప్రారంభమౌతోందో లేదో చూడండి. http: // అని ఉండకూడదు. అలాగే ఫోన్ ద్వారా బ్యాంక్ వివరాలను ఎవ్వరికీ చెప్పొద్దు. ఇకపోతే బ్యాంక్ అధికారులు మీకు కాల్ చేసిన మీ బ్యాంక్, క్రెడిట్ కార్డు వివరాలు అడగరని తెలుసుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *