second marriage problems: నాలుగేళ్ళ చిన్న వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే తప్పా.. నా పిల్లలు ఇలా చేస్తున్నారు.. – what will do when my children are against my second marriage know here all details


సమస్య: నేనొక నలభై ఏళ్ళ స్త్రీని. నాకు ఇద్దరు స్కూల్ కి వెళ్తున్న పిల్లలు ఉన్నారు. నేను డైవోర్సీని. విడాకులు తీసుకోకముందు నా భర్త తో నాకు చాలా టాక్సిక్ రిలేషన్‌షిప్ ఉండేది. మేమిద్దరం బాగా పోట్లాడుకోవడం మా పిల్లలకి తెలుసు. అతను నన్ను కొట్టడం కూడా వాళ్ళు చూశారు. విడాకులు తీసుకుంటున్నప్పుడు కస్టడీ కోసం కూడా ఎంతో పోరాడవలసి వచ్చింది. నేను చెప్పదల్చుకున్నదేమిటంటే, నా పిల్లలు చాలా చిన్నప్పుడే ఇదంతా చూశారని. ఇప్పుడు

నా జీవితం లో ఒక కొత్త పరిస్థితి ఎదురైంది. నేను రెండేళ్ళ నుండీ నా కొలీగ్ ని డేట్ చేస్తున్నాను. అతను నా కంటే నాలుగేళ్ళ చిన్న, మా ఆఫీస్ లోనే జూనియర్ ప్రొఫైల్ లో ఉన్నాడు. రీసెంట్ గా అతను పెళ్ళి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. అతనికి కూడా ముప్ఫై ఆరేళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్ళి చేసుకోమని అడుగుతున్నారు. ఈ కొత్త డెవలప్మెంట్ గురించి మా పేరెంట్స్ తో చెప్తే వాళ్ళు చాలా నెగెటివ్ గా రియాక్ట్ అయ్యారు. నేను మా ఆర్గనైజేషన్ లో చాలా సీనియర్ పొజిషన్ లో ఉన్నాను కాబట్టి అతను ఎడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడని వాళ్ళ వాదన. వాళ్ళు ఈ పెళ్ళికి అంగీకరించమని స్పష్టంగా చెప్పేశారు. అంతే కాక, నా మొదటి పెళ్ళిలో నేను చేసిన తప్పునే మళ్ళీ రిపీట్ చేస్తున్నానని కూడా అంటున్నారు. అది కూడా లవ్ మ్యారేజే. ఇక నా పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. మా అమ్మాయి, టీనేజ్ లో ఉంది, నాతో మాట్లాడడం మానేసింది. నేనితన్ని పెళ్ళి చేసుకుంటే తను ఇల్లు వదిలి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. మా అబ్బాయేమో బాగా భయపడుతున్నాడు. మొన్నొక రోజు నన్నడిగాడు కదా, ఇతను కూడా వాళ్ళ నాన్న లాగానే ఉంటే ఏం చేయాలని. మా పేరెంట్స్ ని కానీ, మా పిల్లల్ని కానీ ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్ధం కావట్లేదు. నేనితన్ని ప్రేమిస్తున్నాను, ఇతనితో నా జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో సలహా ఇస్తారా?

నిపుణుల సలహా: హాయ్, అన్ని కమిట్మెంట్స్ లాగానే పెళ్ళి కూడా నమ్మకంతో ముడిపడి ఉంది. మీకితను రెండేళ్ళుగా తెలుసు కాబట్టి పెళ్ళి లాంటి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కావాల్సిన ప్రేమ, విశ్వాసం మీ మధ్య ఉన్నాయని మీకు నమ్మకం గా తెలుసు. అవసరమైనప్పుడల్లా ఈ విషయం గుర్తు చేసుకోండి.

Also Read : కులాంతర వివాహం చేసుకోవాలనుకుంటే జరిగేవి ఇవే..

మీ ఫ్యామిలీ కి మీ సుఖ సంతోషాలే ముఖ్యం కాబట్టి వారు మీ గురించి ప్రొటెక్టివ్ గానే ఆలోచిస్తారు. మీ ఫ్యామిలీని కన్విన్స్ చేయడం లో మీ పార్ట్నర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, ఆలోచించండి. ఎందుకంటే, మీకు అర్ధమైన పద్ధతిలో అతను వాళ్ళకి కూడా అర్ధం కావాలి కదా. మీతో రిలేషన్‌షిప్ కి సంబంధించి అతనికి ఉన్న కమిట్మెంట్ గురించి కూడా మీ పేరేంట్స్ కన్విన్స్ అవ్వాలి కాబట్టి మీ ఇద్దరితో ఒకే సారి వాళ్ళు మాట్లాడడం కొంత హెల్ప్ చేయవచ్చు. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటో కనుక్కుని వాటన్నింటినీ ఒక్కొక్కటిగా క్లియర్ చేయండి.

Also Read : స్పెషల్ దోశ.. ఎంతో హెల్దీ మరెంతో టేస్టీ.. చేయడం కూడా ఈజీనే..

మీ విడాకులు, కస్టడీ ఇవన్నీ చాలా చిరాకు పెట్టాయనీ, ఆ బాధంతా మీ పిల్లలకి కూడా తెలుసనీ మీరు చెప్పారు. ప్రేమ, ఆప్యాయతే కాక పిల్లలకి సురక్షితమైన వాతావరణం కూడా కావాలి, అది పేరెంట్స్ మాత్రమే కల్పించగలరు. సింగిల్ పేరెంట్ మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ( ఆ మాటకొస్తే డేటింగ్ చేస్తున్నారని తెలియడం కూడా) వారికి కంఫ్యూజింగ్ గా ఉంటుంది. అంతే కాక, ఇన్సెక్యూర్ గా కూడా ఫీల్ అవుతారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కొంత బెంగ ఉండడం కూడా సహజమే. అందుకనే కొంత మంది పిల్లలు బెదిరిస్తే, మరి కొంత మంది పిల్లలు వారిలో వారే ముడుచుకుపోతారు. ఇలాంటి సిచ్యుయేషన్ ఎంతో జాగ్రత్తగా డీల్ చేయాలి.

Also Read : నల్లని పెదాలు ఎర్రగా మారాలంటే ఇలా చేయండి..

మీ పిల్లలిద్దరితోనూ విడివిడిగా మాట్లాడండి. వారి మీద మీకు ఉన్న ప్రేమని నొక్కి చెప్పండి. మీ జీవితం లో వారి స్థానం ఏమీ మారలేదనీ, ఎప్పటికీ మారదనీ చెప్పండి. వాళ్ళ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి తయారుగా ఉండండి. అప్పుడే కాదు, ఎప్పుడు ఎలాంటి సందేహం వచ్చినా మిమ్మల్ని అడగవచ్చని వారికి ధైర్యం చెప్పండి. నెమ్మదిగా మీ పార్ట్నర్ ని వాళ్ళకి పరిచయం చేయండి. అతనూ, వాళ్ళు కలిసి సమయం గడిపేటట్లు చూడండి. మొదట్లో మీరు కూడా ఉండండి. ఒకరితో ఒకర్ అడ్జస్ట్ అవ్వడానికి కావాల్సిన సమయం ఇవ్వండి. మీకు అవసరమనిపిస్తే ఒక కౌన్సిలర్ తో మాట్లాడండి, ఈ సెన్సిటివ్ టైమ్ లో మీకు కావాల్సిన గైడెన్స్ లభిస్తుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *