sensex today: అదరగొట్టిన మార్కెట్.. 2వ రోజూ అదే జోరు! – stock market closing updates may 28th; sensex, nifty close higher for second day as financial stocks extend gains


ప్రధానాంశాలు:

  • స్టాక్ మార్కెట్ పరుగు
  • సెన్సెక్స్ 590 పాయింట్లు ర్యాలీ
  • 9,450 పైకి నిఫ్టీ

దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. బెంచ్‌మార్క్ సూచీలు ఈరోజు కూడా పరుగులు పెట్టాయి. లాభాలతో దూసుకెళ్లాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లలో బలమైన కొనుగోళ్ల కారణంగా మార్కెట్ గురువారం పరుగులు పెట్టింది. ఇండెక్స్‌లు దాదాపు 2 శాతం మేర లాభపడ్డాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్ 597 పాయింట్లు ర్యాలీ చేసింది. 32,200 పాయింట్ల పైకి చేరింది. నిఫ్టీ కూడా 9490 పాయింట్ల పైకి చేరింది. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 595 పాయింట్ల లాభంతో 32,201 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 173 పాయింట్ల లాభంతో 9488 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

Also Read: ఉద్యోగులకు శుభవార్త.. ఇంటి వద్ద నుంచే పని చేస్తే రూ.75 వేలు!

Stock Market Highlights..

✺ నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌‌మెంట్, ఐషర్ మోటార్స్, ఎల్అండ్‌టీ, హీరో మోటొకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు 10 శాతం పెరిగాయి.

✺ అదేసమయంలో విప్రో, ఐటీసీ, సిప్లా, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి. విప్రో 1 శాతం పడిపోయింది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ మినహా మిగతా సూచీలన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 3 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 2 శాతం చొప్పున లాభపడ్డాయి.

✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. 4 పైసలు నష్టంతో 75.76 వద్ద కదలాడుతోంది.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.92 శాతం పెరుగుదలతో 34.94 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.77 శాతం క్షీణతతో 32.24 డాలర్లకు తగ్గింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *