sensex today: ఐటీ, ఫార్మా షాక్.. లాభాల్లోంచి నష్టాల్లోకి! – stock market closing updates may 26th; sensex closes 63 points lower as markets extend losses to second day


ప్రధానాంశాలు:

  • నష్టాల్లో స్టాక్ మార్కెట్
  • సెన్సెక్స్ 60 పాయింట్లు డౌన్
  • 9,000 పైన నిఫ్టీ

దేశీ స్టాక్ మార్కెట్ ఆరంభంలో దుమ్మురేపింది. ఇంట్రాడేలో బెంచ్‌మార్క్ సూచీలు ఏకంగా 1 శాతానికి పైగా పరుగులు పెట్టాయి. కానీ చివరకు వచ్చేసరికి నష్టాలే మిగిలాయి. ఫార్మా, ఐటీ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కారణంగా మార్కెట్ మంగళవారం డీలా పడింది. లాభాలన్నీ హరించుకుపోయాయి.

బ్యాంకింగ్, ఆటో, మెటల్ షేర్లలో లాభాల కారణంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 575 పాయింట్లు ర్యాలీ చేసింది. 31,087 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 9162 పాయింట్ల స్థాయికి పెరిగింది. కానీ చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 63 పాయింట్ల నష్టంతో 30,609 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 9029 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

Also Read: SBI అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంది? బ్యాలెన్స్ తెలుసుకోవడానికి 4 మార్గాలు!

Stock Market Highlights..

✺ నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఈ షేర్లన్నీ 3 నుంచి 6 శాతం మధ్యలో పైకి కదిలాయి.

✺ అదేసమయంలో భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్ దాదాపు 6 శాతం పడిపోయింది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2 శాతం, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1 శాతం, నిఫ్టీ మీడియా 0.2 శాతం చొప్పున నష్టపోయాయి. ఇక మిగతా ఇండెక్స్‌లన్నీ లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు 1 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ ఏకంగా 2.6 శాతం పరుగులు పెట్టింది.

✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 29 పైసలు లాభంతో 75.67 వద్ద కదలాడుతోంది.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.27 శాతం పెరుగుదలతో 35.98 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.23 శాతం పెరుగుదలతో 34 డాలర్లకు ఎగసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *