sensex today: దుమ్మురేపిన మార్కెట్.. 6 వారాల గరిష్టానికి సూచీలు! – stock market closing updates april 29th; sensex, nifty end at over six-week highs led by metal, financial stocks


ప్రధానాంశాలు:

  • స్టాక్ మార్కెట్ ర్యాలీ
  • సెన్సెక్స్ 600 పాయింట్లు అప్
  • 9500 పాయింట్ల పైకి నిఫ్టీ

దేశీ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం కూడా ర్యాలీ చేశాయి. లాక్ డౌన్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఆర్థిక ప్యాకేజ్ ఉండొచ్చనే అంచనాలు ఇందుకు ప్రధాన కారణం. దీంతో స్టాక్ మార్కెట్ 6 వారాల గరిష్ట స్థాయికి చేరింది.

ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 783 పాయింట్ల లాభంతో 32,898 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 9500 పాయింట్ల పైకి ఎగసింది. చివరకు సెన్సెక్స్ 606 పాయింట్ల లాభంతో 32,720 పాయింట్ల వద్ద, నిఫ్టీ 172 పాయింట్ల లాభంతో 9553 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

Also Read: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి పతనం!

Stock Market Highlights..

✺ నిఫ్టీ 50లో హిందాల్కో, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో 7 శాతం పరుగులు పెట్టింది.

✺ అదేసమయంలో యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టైటాన్ వంటి షేర్లు నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్ 4 శాతం పడిపోయింది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పెరిగాయి.

✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 51 పైసలు లాభంతో 75.67 వద్ద కదలాడుతోంది.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 4.05 శాతం పెరుగుదలతో 23.66 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 16.05 శాతం పెరుగుదలతో 14.32 డాలర్లకు ఎగసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *