sensex today: 5 రోజులుగా పైకే.. అదరగొడుతున్న మార్కెట్! – stock market closing updates june 2nd; sensex, nifty rally for fifth straight day end near 3-month highs


ప్రధానాంశాలు:

  • స్టాక్ మార్కెట్ ర్యాలీ
  • సెన్సెక్స్ 500 పాయింట్లు పైకి
  • 10,000 చేరువలో నిఫ్టీ

దేశీ స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. ఈరోజు కూడా బెంచ్‌మార్క్ సూచీలు దుమ్మురేపాయి. మంగళవారం మార్కెట్ మరోసారి మురిపించింది. దీంతో దేశీ ఈక్విటీ మార్కెట్ వరుసగా 5 రోజులుగా లాభాల్లోనే క్లోజ్ అవుతూ వస్తోంది. బ్యాంక్, ఫైనాన్షియల్ రంగ షేర్లతోపాటు హెవీ వెయిట్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరుతో మార్కెట్ దూసుకెళ్లింది.

ఇంట్రాడేలో సెన్సెక్స్ 563 పాయింట్లు వరకు లాభపడింది. నిఫ్టీ కూడా 9996 పాయింట్ల వరకు వచ్చి 10,000 తాకకుండా వెనుదిరిగింది. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 522 పాయింట్ల లాభంతో 33,826 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 153 పాయింట్ల లాభంతో 9979 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

Also Read: 3 రోజులుగా తగ్గుతూనే వస్తున్న బంగారం ధర.. వెండి వెలవెల!

Stock Market Highlights..

✺ నిఫ్టీ 50లో బజాజ్ ఫిన్‌సర్వ్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు దాదాపు 10 శాతం ర్యాలీ చేశాయి.

✺ అదేసమయంలో కోల్ ఇండియా, మారుతీ సుజుకీ, బీపీసీఎల్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు నష్టపోయాయి. కోల్ ఇండియా 3 శాతానికి పైగా పడిపోయింది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగానే క్లోజయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మినహా మిగతా సూచీలన్నీ లాభాల్లోనే ఉండిపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ దాదాపు 1 శాతం పడిపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 3 శాతానికి పైగా పెరిగాయి.

✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 18 పైసలు లాభంతో 75.36 వద్ద కదలాడుతోంది.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.43 శాతం పెరుగుదలతో 39.26 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.34 శాతం పెరుగుదలతో 36.28 డాలర్లకు ఎగసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *