shadnagar gang rape: స్టాఫ్‌ నర్సుకి మత్తుమందిచ్చి గ్యాంగ్ రేప్.. షాద్‌నగర్‌లో దారుణం – staff nurse gangraped by three in shadnagar of hyderabad


కామాంధులు మరోమారు రెచ్చిపోయారు. స్టాఫ్ నర్సుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నమ్మకంగా రప్పించి అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ప్రియురాలికి ఫోన్ చేసిన ప్రియుడు భాను ఏకాంతంగా కలవాలని కోరాడు. నమ్మకంగా వచ్చిన ప్రియురాలిని ఎలికట్ట సమీపంలోని ఐరన్ ఫ్యాక్టరీ వెనుక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

అంతటితో ఆగని దుర్మార్గుడు తన స్నేహితుల కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. ప్రియుడి నీచకోరికను ఆమె తిరస్కరించడంతో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి దారుణానికి ఒడిగట్టారు. మత్తులోకి జారుకున్నాక ప్రియుడి ఇద్దరు స్నేహితులు ఆమెను రేప్ చేశారు. ఆమెపై పడి తమ పశువాంఛ తీర్చుకున్నారు. మెలకువ వచ్చిన ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా దాడి చేశారు.

Also Read: మల్లెపూల తోటలో దారుణం.. పక్కింటి అమ్మాయిని నమ్మకంగా తీసుకెళ్లి..

ఎలాగో వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. ప్రియుడు సహా మరో ఇద్దరు ఆమెపై అత్యాచారానిక పాల్పడినట్టు తెలుస్తోంది. షాద్‌నగర్‌ పరిధిలోనే మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *