shilpashetty yoga: బెల్లీ ఫ్యాట్‌ని ఈజీగా తగ్గించే 4 ఆసనాలు.. శిల్పా శెట్టి రెగ్యులర్‌గా చేసేది ఇవే.. – here are asanas of yoga reduce belly fat


శిల్పా శెట్టి అనగానే మొదటగా మనకి ఆమె చేసే యోగా వీడియోస్ గుర్తొస్తాయి. ఆరోగ్యంగా, అందంగా ఉండాలన్నా ప్రతి రోజూ యోగా చేయడమే మంచిదని చెబుతోంది శిల్పా..40 ఏళ్ల వయసులోనూ, ఓ బిడ్డకు తల్లి అయినా కూడా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు. ఇందుకు కారణం ఆమె రెగ్యులర్‌గా చేసే వర్కవుట్స్ మాత్రమే.

​బ్యూటీ సీక్రెట్స్..

samayam telugu

ఇక బ్యూటీ విషయానికొస్తే రెగ్యులర్‌గా యోగా చేయడమే అని చెబుతోంది శిల్పా. ఓ రకంగా చెప్పాలంటే.. అప్పట్లో యోగాకి అంత క్రేజ్ రావడానికి శిల్పానే కారణం. తాను యోగా గురు రాందేవ్ బాబా లాంటి వారితో యోగా చేస్తూ వాటిని ప్రమోట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయింది. మీరు ఆమె రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న యోగాని చేసి ఆ బెనిఫిట్స్ పొందొచ్చు. అవేంటో తెలుసుకోండి..యోగా ఎలా చేయాలో.. ఏయే ఆసనాలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.. శిల్పా ఈజీగా చెప్పేస్తుంది. అంతేనా, ఎన్నో యోగాకి సంబంధించిన వీడియోస్ కూడా ఆమె రిలీజ్ చేసింది. భాషతో సంబంధం లేకుండా.. ఎన్నో లాంగ్వేజెస్‌లో సినిమాలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న శిల్పాశెట్టి.. హీరోయిన్‌గా బ్రేక్ పడ్డాకా.. బిజినెస్‌మెన్‌‌ని మ్యారేజ్ చేసుకుని ఫుల్ బిజీ అయిపోయింది.

Also Read : హార్ట్ పేషెంట్స్ ఈ టీ తాగితే.. ఎన్నో లాభాలు..

​వైగ్రాసన..

samayam telugu

దీనినే టైగర్ పోజ్ అని కూడా అంటారు. దీనిని చేయడం వల్ల కండరాలు బలంగా మారతాయి. ముఖ్యంగా వెన్ను, పొట్ట కండరాలు స్ట్రాంగ్‌గా మారతాయి. యోగా మ్యాట్ మీద నాలుగు పులిలా నాలుగు వచ్చేలా చేతులు కాళ్లు వంగి ఉండేలా చూడాలి. ఇప్పుడు బాడీ నేలకు సమాంతరంగా ఉంటుంది. ఈ ఆసనంలో ఓ కాలుని ముందుకు వంచి తలను స్టిఫ్గా ఉండేలా చేస్తుంది. కాలుని పూర్తిగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇలా ఓ కాలు తర్వాత మరో కాలుతో చేస్తుండాలి. ఒక్కో పొజిషన్‌లో ఎంత సేపు వీలైతే అంత సమయం ఉండాలి. ఇలా చేయడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గి నాజుగ్గా కనిపిస్తారు.

​పాదహస్తాసన..

samayam telugu

ఇప్పుడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటైన బెల్లి ఫ్యాట్‌ని తగ్గించడంలో ఈ ఆసనం బాగా హెల్ప్ చేస్తుంది. పొట్ట ఉదరం యొక్క మజిల్స్‌ని కరిగిస్తుంది. ఇందులో కాలి బొటన వేలు నుంచి చీల మండ పాదలాను తాకుతాం. కాళ్లు నిటారుగా ఉంచి కడుపు పై భాగాన్ని వంచి చేతులతో పాదాలను తాకే ఈ స్థితిని పాదహస్తాసన అని అంటారు ఎలా చేయాలంటే.. ముందుగా చదునైన నేలపై నిటారుగా ఉండాలి. ఈ స్థితిలో కాళ్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి. అలానే మెల్లిగా గాలి పీల్చుకుంటూ చేతులను పైకి ఎత్తి.. భుజాలు చెవులను తాకుతూ ఉండేలా చూడాలి. అది విధంగా.. గాలి వదులుతూ ముందుకు వంగాలి. ఇదే సమయంలో చేతులు పాదాలను తాకుతూ ఉండాలి. మోకాళ్ళకు సాధ్యమైనంత దగ్గరగా తీసుకురావాలి. ఇదే స్థితిలో 30 నుంచి 40 సెకన్స్ ఉండాలి.. ఇలా రెగ్యులర్‌గా చేస్తే బెల్లి ఫ్యాట్ కరిగిపోతుంది.

Also Read : పురుషాంగం వంకరగా ఉంటే ప్రమాదమా..

​వీర భద్రాసనం..

samayam telugu

ముందుగా సరిగ్గా నిల్చొండి. ఆ తర్వాత ఎడమ పాదంని 4 అడుగుల దూరానికి జరపండి. ఇప్పుడు ఎడమకాలుని కొద్దిగా ఎడమవైపుకి తిప్పండి. అలానే కుడికాలుని కూడా గుండ్రంగా తిప్ుపుతూ ఉండండి. ఆ తర్వాత మీ పాదాలను యథాస్థానానికి తీసుకొచ్చు. బాడీని మొత్తం తిప్పండి. తర్వాత ఎడమకాలుని వంచండి. మఇప్పుడు మీ బాడీని తిరిగి అదే స్థానంకి తీసుకొచ్చు. రెండు చేతులు తలవైపు చాచి నమస్కరించండి. ఇలా చేయడం వల్ల మీలో శక్తి పెరుగుతుంది.

Also Read : గోరువెచ్చని నీటిలో ఇవి కలిపి తాగితే.. ఇమ్యూనిటీ పెరిగి కరోనా వచ్చే ఛాన్స్ తగ్గుతుందట..

​నౌకాసనం..

samayam telugu

పడవ ఆకృతిలో ఉంటాం కాబట్టి దీనికి నౌకాసనం అని పేరు వచ్చింది. ఈ ఆసనం చేయాలంటే ముందుగా చాపపై వెల్లకిలా పడుకోండి. ఆ తర్వాత కాళ్లని రెండింటిని చేతుల దగ్గరికి తీసుకురావాలి. చేతులని కూడా ముందుకు తీసుకురావాలి. అంటే మన నడుము భాగంపైనే మొత్తం శరీర బరువు పడుతుంది. కాళ్ళు, చేతులని స్ట్రెయిట్‌గా ఇలా తీసుకురావాలి. ఇలా చేసే సమయంలో శరీరం పడవ ఆకృతిలో ఉంటుంది. నేల అర అడుగు ఎత్తులో ఉంటుంది. ఈ ఆసనాలన్నీ కూడా బాడీ షేప్ సరిగ్గా ఉంచడమే కాకుండా.. అందంగా కనిపించేలా చేస్తాయి. శిల్పా శెట్టి రెగ్యులర్‌గా ఇవే పాటిస్తుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *