Sino-India border: చైనా చర్యలతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. అదనపు బలగాలు మోహరించిన భారత్ – india and china deploy additional troops on line of control, fortify more ladakh areas


మే నెల ప్రారంభంలో భారత్‌, చైనా సరిహద్దుల్లో ఇరు సైన్యాలు బాహాబాహీ దిగి, ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన విషయం తెలిసింది. అప్పటి నుంచి ఏర్పడిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనాలు తమ బలగాలను మోహరించాయి. ఈ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. సైనిక బలగాల మోహరింపుతో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దెమ్‌చోక్, చుమార్, దౌలత్ బేగ్ ఓల్డై, గాల్వాన్ లోయ వద్ద బలగాలను మోహరించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Read Also: దేశంలో కరోనా మరో రికార్డ్: లక్ష దాటేసిన పాజిటివ్ కేసులు.. 109 రోజుల్లో
చైనా సైన్యం తొలుత ఓ నది వద్ద గుడారాలు వేసి, నిర్మాణాలు ప్రారంభించడంతో గాల్వాన్ లోయ వద్ద సైన్యాన్ని మోహరించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గాల్వన్ ప్రాంతం 1962 భారత్-చైనా యుద్ధంలో కూడా కీలకంగా వ్యవహరించింది. ఈ వివాదాస్పద ప్రాంతం తమదంటూ చైనా వాదిస్తూ నిర్మాణాలకు ప్రయత్నిస్తోంది. గత కొన్నేళ్లుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కవ్వింపు చర్యలను పునరావృత చేస్తోంది. ఈ ప్రాంతంలో 2013 ఏప్రిల్-మే నెలలో 21 రోజుల పాటు ఇరు సేనల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి.

Read Also: కరోనాపై స్వతంత్ర దర్యాప్తునకు డబ్ల్యూహెచ్‌ఓ అంగీకారం.. మద్దతు తెలిపిన చైనా!
డీబీఓ సెక్టార్‌లోని దెప్సాంగ్ బుల్గే ప్రాంతంలో చైనా సైన్యం భారత్ భూభాగంలో 19 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చింది. సింధు నది పరివాహక ప్రాంతంలోని దేమ్‌చోక్ వద్ద కూడా 2018లో 300 నుంచి 400 మీటర్ల మేర మన భూభాగంలో చొచ్చుకురావడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తర్వాత దీని ఇరు సైన్యాలకు చెందిన దౌత్యవేత్తలు చర్చించడంతో వివాదం సద్దుమణిగింది.

పదేపదే ప్రయత్నించినా ఈ విషయంపై స్పందించడానికి సైన్యం నిరాకరించింది. మొత్తం 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఓసీ వెంట చిన్ని చిన్న వివాదాలు సహజమేనంటూ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణే రెండు రోజుల కిందట వ్యాఖ్యానించడం గమనార్హం. మే 6న సరిహద్దుల్లో చైనాకు చెందిన సైనిక విమానాలు భారత భూభాగానికి అతి సమీపంగా ఎగిరాయి.

Read Also: ఢిల్లీ వాటర్ బోర్డు అధికారికి కరోనా… క్వారంటైన్‌కు 10మంది
మంగళవారం (మే 12) ఉదయం చైనాకు చెందిన మిలిటరీ విమానాలు ఇండియా-సినో సరిహద్దు వద్ద నిషిద్ధ గగనతలంలో పలుమార్లు చక్కర్లు కొట్టాయని భారత వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలు అక్కడికి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఫలితంగా మరోసారి అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Read Also: కోతులపై ప్రయోగాల్లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ విఫలం.. కరోనాకు వ్యాక్సిన్ డౌటేనా?
దాదాపు రెండేళ్ల తర్వాత భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఇరు పక్షాలూ అక్కడికి అదనపు బలగాలను తరలించాయి. మే 6న ఉదయం ఇరు దేశాలకు చెందిన స్థానిక సైనికాధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అనంతరం ఘర్షణ సద్దుమణిగిందని వెల్లడించారు. అయితే, గత శనివారం సిక్కిం సెక్టార్‌లోని ‘నాథులా పాస్‌’ వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ఇక్కడ భారత్, చైనాకు చెందిన సుమారు 150 మంది సైనికులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. తాజాగా లద్ధాక్‌లో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *