Siva Balaji: Madhumitha: పాలుతో మునగకాయ కర్రీ.. శివబాలాజీ భార్య వంటకం భలే రుచిలే – bigg boss fame siva balaji wife madhumitha drumstick and milk curry recipe


ఈ లాక్ డౌన్.. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలాజీ అభిమానులకు.. రుచుల పంటగా మారిపోయింది. ‘శివమధు కిచెన్’ పేరుతో.. తమ లైఫ్‌లోని అనుభవాలు, అనుభూతులు షేర్ చేసుకుంటూ.. కమ్మని వంటలని పరిచయం చేస్తున్నారు ఈ దంపతులు. ఎగ్ రెసిపీలతో పాటు పన్నీర్ పొటాటో టిక్కా, చికెన్ ఫ్రై, చాపల పులుసు.. ఇలా వెరైటీ స్టైల్‌లో, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చెబుతూనే.. అప్పుడప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో వండిన వంటలని కూడా వండి ‘వావ్ యమ్మీ’ అనిపించేస్తున్నారు. ఇందులో భాగంగా మధుమిత మరోసారి సరికొత్త వంటకంతో ముందుకొచ్చారు. ‘మునగకాయ పాలు కర్రీ’ అంటూ.. వండుతూనే నోరూరించారు. అయితే మధు చేసిన కర్రీతో పాటు.. క్లైమాక్స్‌లో శివబాలాజీ ఎక్స్‌ప్రెషన్స్ సూపర్ అంటున్నారు అభిమానులు.

గతంలో కేఎఫ్‌సీ చికెన్, ఫిష్ కర్రీ అంటూ.. శివబాలాజీ చేసిన వీడియోస్‌కి.. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్స్, కామెంట్స్‌తో పాటు.. ‘మీ బిగ్ బాస్ ట్రోఫీ చూపించండీ’ అంటూ అభిమానులు రిక్వస్ట్ చెయ్యడంతో… తర్వాత వీడియోలో బిగ్ బాస్ ట్రోఫీతోనే ఎంట్రీ ఇచ్చాడు శివబాలాజీ. అదే వీడియోలో బిగ్ బాస్‌ హౌస్‌లో తను చేసిన ఫిష్ ఫ్రై తయారీ విధానం చెప్పి.. నోరూరించాడు. ఇక మధుమిత కూడా అదే బాటలో.. అభిమానులకి మరో సరికొత్త వంటని పరిచయం చేసింది. ఈసారి మునగకాయ-పాలు కర్రీ వండేసి.. మునగకాయ ముక్కలు ఎలా తినాలో కూడా చెప్పి లొట్టలెయ్యించింది.

మునగకాయ-పాలు కర్రీకి కావాల్సిన పదార్థాలు
ఆవాలు – కొద్దిగా, మునగకాయలు – 4 లేదా 5(పీచు తియ్యకూడదు), ఉల్లిపాయలు – 4 లేదా 5 (మీడియం సైజ్, మునగకాయలను బట్టి వాటితో సమానంగా ఉల్లిపాయలు తీసుకోవాలి), నూనె – అభిరుచిని బట్టి, ఉప్పు – తగినంత, పసుపు – కొద్దిగా, నీళ్లు – 2 గ్లాసులు, పాలు – 1 గ్లాసు(మీగడతో ఉంటే ఇంకా మంచిది). తయారీ విధానం మధుమిత మాటల్లోనే విందాం! పైగా లాస్ట్‌లో శివబాలాజీ ఎక్స్ ప్రెషన్స్ మాత్రం మిస్ కాకండి సుమీ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *