Sleep Apnea: నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. ఇదే కారణం కావొచ్చు.. – what are the warning signs and causes of sleep apnea know here all details in telugu


నిద్ర లేమికీ, శారీరక మానసిక ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించి అవగాహన ఏర్పడవలసిన అవసరాన్ని కరోనా మహమ్మారి తెలియజేసింది. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ నుండి రికవర్ అవుతున్నప్పుడు నిద్ర ఎంతో అవసరం. హాయిగా నిద్రపోగలిగితేనే ఎనర్జెటిక్‌గా, ప్రొడక్టివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతారు. అలాగే, రకరకాల స్లీపింగ్ డిసార్డర్స్ వల్ల సరిగ్గా నిద్ర పోలేకపోతే అది డయాబెటీస్, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్, బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వంటివాటికి కారణం కావచ్చు. ఇన్సోమ్నియా, నార్కోలెప్సీ వంటి స్లీపింగ్ డిసార్డర్స్ ని రికగ్నైజ్ చేయడం తేలిక, కాని, స్లీప్ యాప్నియా వంటి చాలా మందికి తెలియని వాటిని గుర్తించడం కష్టం.

Also Read : ఈ రాశి వారిని పెళ్ళి చేసుకుంటే ఎలాంటి గొడవలు రావట..

స్లీప్ యాప్నియా అంటే ఏమిటి?

స్లీప్ యాప్నియా నిద్రకి సంబంధించిన ఒక బ్రీథింగ్ డిజార్డర్. ఇందువల్ల నిద్రలో శ్వాస తీసుకోవడం కొన్ని సెకన్ల పాటూ ఆగిపోతుంది. ఇలా రాత్రంతా జరుగుతూనే ఉంటుంది. గొంతులో ఉన్న మజిల్స్ ఓవర్ రిలాక్సేషన్ వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. స్లీప్ యాప్నియా రాత్రి చాలా సార్లు సంభవించవచ్చు. అలా జరిగినప్పుడు టిష్యూలకి కావలసినంత ఆక్సిజెన్ లభించదు. శ్వాస సరిగ్గా అందక హఠాత్తుగా నిద్ర మెలకువ వచ్చేస్తుంది, సరైన నిద్ర లభించదు. ఫలితంగా, పొద్దున్నే లేచిన తర్వాత తలనొప్పిగా ఉండడం, నీరసం, మూడ్ సరిగా ఉండకపోవడం, డిప్రెషన్ వంటివి కూడా కలుగవచ్చు.

స్లీప్ యాప్నియా కీ మెంటల్ హెల్త్ కీ…

స్లీప్ యాప్నియా వల్ల వచ్చే డైరెక్ట్ కాన్సీక్వెన్స్ నిద్రలేమి. ఇలా రెగ్యులర్‌గా జరుగుతుంటే ఎనిమిది గంటలు పడుకుని లేచాక కూడా అలసటగా, నిద్ర మత్తుగా ఉంటుంది. ఎందుకంటే, ఆ ఎనిమిది గంటలూ పూర్తిగా నిద్రపోలేదు కదా. ఫలితంగా బాడీలో క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్స్ ఏర్పడతాయి. అవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి కారణమవుతాయి. అందువల్ల బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క ఇంబాలెన్స్ ఏర్పడుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా డిప్రెషన్ కి ప్రధాన కారణం అవ్వగలదని తెలుస్తోంది. అంతే కాక, ఈ స్టడీ లో స్లీప్ యాప్నియా ఎక్కువగా ఆదాయం తక్కువున్న కుటుంబాల్లో వారికీ, ఒక్కరే ఉంటున్న వారికీ, సోషల్ సపోర్ట్ తక్కువగా ఉన్న వారికీ ఎక్కువగా వస్తుందని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో కూడా స్లీప్ యాప్నియాకీ డిప్రెషన్ కీ మధ్య సంబంధం ఉందని తెలుస్తోంది. నిద్ర లేమి సమస్య పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ తో చేసే పనుల్లో సామర్ధ్యం తగ్గుతుందని తెలుస్తోంది. పైగా రోజులు గడిచే కొద్దీ ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది.

అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల వచ్చే నిద్ర లేమి మూడ్ స్వింగ్స్ కీ, ఆఫీసుల్లో కొలీగ్స్ తో ఇరిటబుల్ బిహేవియర్ కీ దారి తీస్తుంది. పైగా ఈ సమస్య ఉన్న వారి ఆలోచనా శక్తీ, పని చేసే సామర్ధ్యం తగ్గిపోతూ ఉంటాయి. ఫలితంగా ఉత్పాదకత తగ్గిపోతుంది.

Also Read : పెళ్ళి వద్దంటున్న చెల్లికోసం అన్నయ్య ఏం చేశాడంటే..

ట్రీట్మెంట్ ఎలా…

మీకు ఈ సమస్య ఉందని అనుమానం వచ్చిన వెంటనే మీ ఫ్యామిలీ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్ తరువాత మీరు స్లీప్ టెస్ట్ చేయించుకోవాల్సి రావచ్చు. స్లీప్ టెస్ట్ అన్న పేరు కొంచెం కాంప్లికేటెడ్ గా కనిపించవచ్చు కానీ ఇది చాలా ఈజీగా ఒక్క రాత్రిలో చేసే టెస్ట్. ఇది ఇంట్లో కూడా చేసేయవచ్చు. ఈ టెస్ట్ లో నిద్రకి ముందు మీకు ఒక పరికరం అమరుస్తారు. ఈ పరికరం మీ ఆక్సిజెన్ లెవెల్స్ ని మానిటర్ చేస్తుంది, గురకని రికార్డ్ చేస్తుంది, శ్వాస తీసుకోవడం ఎక్కడైనా కొన్ని సెకన్లు ఆగితే మానిటర్ చేస్తుంది. సివియర్ కేసుల్లో కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్ (సీపీఏపీ) థెరపీ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు.

అంటే..

ఇది స్లీప్ యాప్నియా ని మ్యానేజ్ చేసే ఒక స్టాండర్డ్ థెరపీ. సీపీఏపీ మెషీన్ లంగ్స్, అప్పర్ ఎయిర్‌వే ప్యాసేజెస్ ఓపెన్ గా ఉండడానికి కావాల్సినంత గాలి మాత్రమే పీల్చేలాగా హెల్ప్ చేస్తుంది, బ్రీదింగ్ మధ్యలో వచ్చే పాజ్ ని ప్రివెంట్ చేస్తుంది. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులూ, అడ్డంకులూ లేకుండా కంటిన్యువస్ గా నిద్ర పడుతుంది.

Also Read : పాలు తాగితే కాన్సర్ రాదా..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *