smoothies for summer: సమ్మర్‌లో ఈ స్మూతీస్‌ చేసుకుని తాగితే కచ్చితంగా బరువు తగ్గుతారు.. – best summer smoothies recipe know here how to prepare


స్పెషాలిటీస్ ఇవే..

– స్మూతీలని చేయడం చాలా తేలిక.
– మీకిష్టమైన పండ్లు, కూరలు ఇందులో కలుపుకోవచ్చు.
– మీకు నచ్చిన గింజలు కూడా వేసుకోవచ్చు.

మనం గమనించితే.. గత కొద్ది రోజులుగా మనం తీసుకునే ఆహారంలో మనకు తెలియకుండానే కొన్ని మార్పులు జరిగాయి. వేడి, వేడి కాఫీ, టీ ల బదులు చల్ల చల్లగా ఏమైనా తాగాలనిపిస్తోంది. రకరకాల డ్రింక్స్‌ని ఈ టైమ్‌లో ట్రై చేయొచ్చు. వేసవిలో మాత్రమే దొరికే మామిడి పండ్లతో, నిమ్మ, కీరలతోనూ చేసిన చల్లటి పానీయం తాగితే దాహం తీరటమే కాదు. వేసవి అలసట చేత్తో తీసేసినట్టు మాయమైపోతుంది. వేసవికాలం వచ్చిందంటే షేక్స్, ఇంకా స్మూతీస్ వచ్చేస్తాయి. మీకిష్టమైన పండ్లు, కూరల్ని, పాలతోగానీ, పెరుగుతోగానీ కలిపి చేసేదే స్మూతీ. మీరు వీగన్ అయితే ఆల్మండ్ మిల్క్ గానీ, సోయా మిల్క్ గానీ వాడుకోవచ్చు. రుచిగా ఉండటం, కడుపు నిండినట్టుగా ఉండటమే కాదు. కొన్ని స్మూతీలు బరువు తగ్గిస్తాయి కూడా.

samayam telugu

smoothi toi 1

Also Read : ఈజీగా ఇంట్లోనే చేసే ఈ వర్కవుట్స్‌తో త్వరగా బరువు తగ్గొచ్చు..

అలాంటి కొన్ని చల్ల చల్లని వేసవి స్మూతీల గురించి తెలుసుకోండి..

1. స్ట్రాబెర్రీ స్మూతి

వేసవి భగభగల్ని తట్టుకోడానికి మనకి ప్రకృతి ప్రసాదించిన వరాల్లో స్ట్రాబెరీస్ కూడా ఉంటాయి. కొద్దిగా పుల్లగా ఉండి, నోరూరించే స్ట్రాబెర్రీస్‌‌ని పాలతోనో, పెరుగుతోనో కలిపి చిక్కటి స్మూతీగా చేసుకొండి. చల్లగా ఆస్వాదించండి.

2. పీచ్, రాస్‌బెర్రీ, నట్స్ స్మూతి
పండ్ల మంచి గుణాలని పిల్లలు పొందాలంటే ఈ స్మూతీస్ చేసి తీరాల్సిందే. ఇందులో నట్స్ కూడా కలపడం వల్ల ఈ స్మూతీ మరింత రుచికరంగా తయారవుతుంది.

Also Read : రోజులో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే పిల్లలు పుట్టరా..

3. మామిడి పండ్ల స్మూతి

ఈ స్మూతీ ఇంకా రాలేదేంటని చూస్తున్నారు కదా! మామిడిపళ్ళు లేని వేసవికాలాన్ని ఊహించలేం కదా. మామిడి పళ్ళ రసం, పెరుగు, పాలు కలిపి ఈ స్మూతీ చేసుకోండి. ఆనందంతో మీ ముఖం విప్పారకుండా ఈ స్మూతీని తాగగలరేమో చూద్దాం.

samayam telugu

smoothi toi 2

4. కర్బూజా, కివీ స్మూతి

వేసవితో పాటూ కర్బూజాలు కూడా వచ్చేస్తాయి. తియ్యగా నోరూరించే కర్బూజాలు విడిగా తిన్నా కూడా చాలా బావుంటాయి. కానీ, వీటిని కివీలతో కలిపి స్మూతీ చేస్తే ఆ రుచే వేరసలు.

Also Read : ఆఫీస్‌కి వెళ్లే ముందు ఇలా చేస్తే ఎక్కువ జీతం వస్తుందట..

5. పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతి

గులాబీరంగులో అందంగా కనిపించే ఈ స్మూతీ ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ కూడా ఇస్తుంది. ఈ స్మూతీ తయారుచేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువే చేసి పెట్టుకోండి. పిల్లలూ, పెద్దలూ కూడా ఇంకాస్త కావాలి అనకపోతే నాకు చెప్పండి.

బరువు తగ్గించే స్మూతీస్..

స్మూతీలతో మరో లాభం ఏంటంటే వీటి వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఇందులో అన్నీ తాజా పండ్లు, కూరగాయలతో చేస్తారు. వీటివల్ల శరీరానికి అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అందుతాయి. ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణ శక్తి మెరుగ్గా మారి త్వరగా బరువు తగ్గుతారు.

ఈ స్మూతీలు తయారు చేస్కుని తాగి మీకెంత నచ్చిందో మాకు చెప్పండి. మీ దగ్గర ఏమైనా స్మూతీ రెసిపీలు ఉంటే మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. వీటి వల్ల వాటి రుచిని ఎంజాయ్ చేయడమే కాకుండా.. వాటి హెల్దీ బెనిఫిట్స్‌ని కూడా పొందొచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *