snoring treatment: గుడ్ న్యూస్.. గురకను మాయం చేసే మాత్ర వచ్చేస్తోంది.. ఎలా పనిచేస్తుందంటే.. – new pill being developed by us scientists could help stop snoring


గురక.. ఇది అనారోగ్యానికి సూచిక. గురక సమస్యను ఎదుర్కొనేవారు బాగానే నిద్రపోతారు. కానీ, వారి పక్కన నిద్రపోయేవారికే అసలైన సమస్య. పాపం.. ఆ గురక సౌండ్ భరించలేక నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఇలా గురక వల్ల నిద్రకు దూరమవుతున్న వ్యక్తులకు అమెరికా పరిశోధకులు ఓ శుభవార్త చెప్పారు. త్వరలో తాము గురకను మాయం మాత్రను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (Obstructive Sleep Apnoea) అనేది గురకకు పరిభాష. దీన్ని కంట్రోల్ చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఔషదం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ‘అప్నీమెడ్’ అనే సంస్థ గురకను నియంత్రిచే పిల్స్ తయారు చేస్తున్నామని పేర్కొంది. ఈ మాత్రలు గురక సమస్యను 75 శాతం వరకు పరిష్కరించగలవని తెలిపారు. AD109 కోడ్‌ నేమ్‌తో వీటిని ప్రయోగిస్తున్నారు.

‘డైలీ మెయిల్’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. గురకను తగ్గించే ఈ మాత్రల్లో ఇప్పటికే వాడుకలో ఉన్న రెండు రకాల ఔషదాలను ఉపయోగించనున్నారు. దీన్ని పిల్లల్లోని హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD) ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మెదడులో ఏకాగ్రతను కలిగించే నోరాడ్రినలిన్ (Noradrenaline) అనే రసాయన స్థాయిని పెంపొందిస్తుంది. అయితే.. ఇది గాలి ద్వారాలకు ఉండే కండరాలను సైతం మంచిగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read Also: ‘నా భార్య.. తన ప్రియుడిని అన్నయ్య అంటోంది, పెళ్లికి ముందే అతడితో..’

అలాగే.. ఇందులో ఉపయోగిం రెండో ఔషదం.. ఆక్సిబుటినిన్ (Oxybutynin). గురక పెట్టేవారిలో నాలుక స్థిరంగా ఉండదని, అది గొంతుకు అడ్డుపడి సౌండ్ వచ్చేలా చేస్తుంది. అయితే, ఆక్సిబుటినిన్ నాలుకను స్థిరంగా ఉంచి.. గొంతుకు అడ్డుపడకుండా ఉంచగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఔషదాన్ని ఎక్కువగా మూత్రాశయంలోని కండరాలను స్థిరంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు.

Read Also: ఈ 8 రాశులవారు తమ భాగస్వామిని చీట్ చేస్తారట, ఎందుకంటే..

ఈ రెండు ఔషదాల కలయికతో రూపొందించే ఈ పిల్స్.. తప్పకుండా సత్ఫలితాలిస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఔషదంపై మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ స్లీప్ ఎక్స్‌పర్ట్, బ్రిటీష్ స్లీప్ సొసైటీ సభ్యుడు డాక్టర్ నీల్ స్టాన్లే మాట్లాడుతూ.. ‘‘ఇవి చాలా ఆసక్తికరమైన పరిశోధన. ఇది తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాం. అయితే, దీనిపై మరింత పరిశోధన అవసరం. దీనికి సంబంధించిన రెండో దశ క్లీనికల్ ట్రైల్స్ తర్వాతి నెలలో ప్రారంభం కానున్నాయి’’ అని తెలిపారు.

గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఈ మాత్ర తయారీ ఇంకా పరిశోధన, పరీక్షల స్థాయిలోనే ఉన్నాయని గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *