Spine Problems: వెన్నెముక విచ్ఛిన్నం చేసే అలవాట్లు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! – daily activities that may cause spine or lower back pain


వెన్నెముక.. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన భాగం ఇది. దీనికి ఏ చిన్న గాయమైనా ప్రాణం విలవిల్లాడుతుంది. రోజువారీ పనులపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే, వెన్నెముక సమస్యలను వెంటనే గుర్తించలేం. సమస్య వచ్చిన తర్వాత తగ్గించలేం. అందుకే, మొదటి నుంచి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి.

మన రోజువారీ పనులే మన వెన్నెముకపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే సంగతి చాలామందికి తెలీదు. ఆ పనులే నెమ్మది నెమ్మదిగా వెన్నును కుంగదీస్తాయి. బరువులు ఎత్తుడం, వ్యాయామాలు కూడా వెన్నుముకపై భారాన్ని పెంచేస్తాయి. ఈ నేపథ్యంలో ఈ కింది రోజువారీ పనులపై మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.

మొబైల్ వినియోగం: మొబైల్ ఫోన్ వినియోగం వెన్నుముకపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎక్కువ సేపు తలను ఒకవైపే ఆన్చడం, మెడను పక్కకు వాల్చి ఫోన్ మాట్లాడటం, అతిగా గేమ్స్ ఆడటం వంటివి వెన్నుకు భారమవుతుంది. కాబట్టి ఫోన్‌తో ఎక్కువ సేపు గడపకండి. ముఖ్యంగా మీ పిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచండి. ఫోన్‌తో ఎక్కువ సేపు గడుపుతున్నట్లయితే భవిష్యత్తులో వారికి మెడ, వెన్నెముక సమస్యలు తలెత్తవచ్చు.

హై హీల్స్: మహిళలు ఎక్కువగా హైహీల్స్ ధరించి నడవడానికి ఇష్టపడతారు. అయితే, ఇది చాలా ప్రమాదకరం. ఎక్కువ సేపు హైహీల్స్‌పై నడిచేవారికి వెన్ను అమరిక అదుపు తప్పుతుంది. భవిష్యత్తులు వెన్ను సమస్యలు తలెత్తుతాయి. హైహీల్స్‌కు బదులు ఫ్లాట్ చెప్పులు ధరించడమే ఉత్తమం. మోస్తారు ఎత్తు ఉండే చెప్పుల ధరించిన పెద్దగా సమస్య ఉండదు.

కుర్చునే విధానం: ఆఫీసులో ఎక్కువ సేపు కుర్చీలకు అతుక్కొనిపోయేవారికి కూడా వెన్నుముక సమస్య తప్పదు. తప్పుడు భంగిమలో కుర్చున్నట్లయితే మీ వెన్నుముక అదుపు తప్పుతుంది. తుంటిపై భారం పడుతుంది. ఈ సమస్య రాకూడదంటే.. ప్రతి అరగంటకు ఒకసారి మీ తల, మెడను కిందికి, పైకి, కుడి-ఎడమలకు తిప్పుతూ ఉండండి. ఎక్కువసేపు కూర్చునేవారికి వారికి.. మెడ, వెనుక కండరాలు, వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. వెన్నుభాగం కుర్చీకి నిటారుగా ఉండాలి. పాదాలు నేలను తాకాలి. ప్రతి అరగంటకు ఒకసారి లేచి అటూ ఇటూ కదలండి.

పడుకొనే భంగిమ: నిద్రలో పడుకొనే భంగిక కూడా సక్రమంగా ఉండాలి. లేకపోతే వెన్నెముక అదుపుతప్పుతుంది. మీరు పడుకొనే భంగిమ సక్రమంగా లేకపోతే వెన్నుముకపై ఒత్తిడి పెరిగి మెడ నొప్పి వస్తుంది. మీరు తలకింద పెట్టుకునే తలగడ ఎత్తు కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. బాగా ఎత్తైన తలగడ కాకుండా తక్కువ ఎత్తు గల దిండును వాడండి. వీలైతే మోకాళ్ల కింద ఒక తలగడ పెట్టుకుంటే శరీరానికి చాలా రిలాక్స్‌గా ఉంటుంది. ఇంటి పనులు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్నుపై భారం పడకుండా పనులు చేయాలి.

Also Read: అరటి పండ్లతో హెయిర్ మాస్క్.. ఇలా చేస్తే జుట్టు సమస్యలన్నీ దూరం!

అధిక బరువులు: ఒక్కోసారి మనం అధిక బరువులు మోయాల్సి వస్తుంది. ముఖ్యంగా సంచులు, సూట్‌కేసులు మోస్తున్నప్పుడు ఒక చేత్తో పక్కకి వాలిపోతాం. అది కూడా వెన్నెముక సమస్యకు దారితీయవచ్చు. అలాగే, వ్యాయమాలు చేసేప్పుడు కూడా ఇష్టానుసారంగా బరువులు ఎత్తకూడదు. శిక్షకుడి సూచనల మేరకే బరువులు ఎత్తాలి. పిల్లల స్కూల్ బ్యాగ్గులు సైతం ఎక్కువ బరువు ఉండకూడదు. వారి శరీర బరువులో కేవలం 20 శాతం కంటే ఎక్కువ బరువు మోయకూడదు.

పోషకాహరం తీసుకోండి: ఆహారపు అలవాట్లు బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, అవోకాడో వంటివి వెన్నుకు మేలు చేస్తాయి. ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Also Read: ఓరల్ సెక్స్ ఆరోగ్యానికి మంచిదేనా? ఎలాంటి సమస్యలు వస్తాయి?

ఈ లక్షణాలు ఉంటే వెన్నెముక సమస్యే:
❂ నడిచేప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.
❂ మూత్ర విసర్జన సమస్యలు వస్తాయి.
❂ కాళ్లు, భుజాలు కదిపేందుకు ఇబ్బందిపడతారు.
❂ తిమ్మిర్లు ఏర్పడతాయి.
❂ స్పృహ కోల్పోవడం, తలనొప్పి వస్తాయి.
❂ మెడ వద్ద తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *