srikakulam dsp suicide: శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య – srikakulam special branch dsp committed suicide


విశాఖపట్నంలో శుక్రవారం ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం విశాఖ బీచ్‌ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన మరణించి ఉన్నారు. అనారోగ్య కారణాల వల్లే డీఎస్పీ కృష్ణ వర్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవలే డీఎస్పీ కృష్ణ వర్మకు గుండెకు సంబంధించిన ఆపరేషన్‌ కూడా జరిగినట్లు తెలుస్తోంది. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్ల పాటు ఎస్‌ఐగా పని చేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. డీఎస్పీ కృష్ణ వర్మ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *