srikakulam serial killer: శ్రీకాకుళంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్.. ముగ్గురు మహిళలను కిరాతకంగా – serial killer arrested in srikakulam district,


ముగ్గురు మహిళలను దారుణంగా హత్యచేసి తప్పించుకుని తిరుగుతున్న సీరియల్ కిల్లర్ రమేశ్‌(55)ఎట్టకేలకు శ్రీకాకుళం జిల్లా పోలీసులకు చిక్కాడు. ఒడిశాలోని గజపతి జిల్లా గండాహతి పంచాయతీ వలకభద్ర గ్రామానికి చెందిన సవర రమేష్‌ రంప పంచాయతీ పరిధిలో భీంపురం గ్రామానికి చెందిన మహిళను కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేష్‌ భార్యకు 2010 నుంచి మతి భ్రమించడంతో వేరుగా ఉంటున్నాడు. 2016 అక్టోబరులో బొడహంసకు చెందిన మహిళ భీంపురం పంటపొలాల్లో పశువులను కాసేందుకు వచ్చింది. ఆమెపై కన్నేసిన రమేష్ అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించటంతో గొంతునులిమి చంపేసి తెలంగాణ రాష్ట్రానికి పరారయ్యాడు.

Also Read: దివ్య శరీరంపై 33 వాతలు.. వ్యభిచారం మానేస్తానన్నందుకే ఘాతుకం

భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గ్రామ సమీపంలోని పేపర్‌ మిల్లులో కూలీగా చేరిన రమేష్ చింతలపాడు గ్రామానికి చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. 2017 నవంబరులో లేబర్ క్వార్టర్స్‌ వద్ద తన కోరిక తీర్చాలని అడగగా ఆమె నిరాకరించింది. కోపంతో ఆమె గొంతు నులిమి బురదలో కూరి కిరాతకంగా చంపేసి పరారయ్యాడు. అప్పట్లో అశ్వారావుపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ నుంచి పరారైన రమేష్‌ గుంటూరు జిల్లా గొకినకొండ గ్రామం చేరుకుని చేపల చెరువు వద్ద పనికి చేరాడు. అక్కడే సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన ఓ మహిళ పనిచేసేది. ఆమెకు భర్తలేడని తెలుసుకున్న రమేష్‌ డబ్బు ఆశ చూపించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నా్ళ్ల తర్వాత ఆమె స్వగ్రామానికి వెళ్లిపోవడంతో తనను మరిచిపోయిందని భావించి కక్ష పెంచుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో మెళియాపుట్టి మండలం పట్టుపురం వద్దకు ఆమెను రప్పించాడు. గొంతు నులిమి, చేతులతో కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఆఫ్‌షోర్‌ కాలువలో పడేశాడు. ఆ తర్వాత వజ్రపుకొత్తూరుకు పరారయ్యాడు.

Also Read: ప్రియురాలి ఇంట్లోనే యువకుడి దారుణహత్య.. గదిలో ఏకాంతంగా ఉండగా

కాలువలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమె ఫోనుపై దృష్టి సారించారు. 3 నెలలు పాటు ఆ ఫోన్ ఎవరూ ఉపయోగించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఆ ఫోన్‌లో రమేష్ కొత్త సిమ్‌ వేసి వినియోగించడం మొదలుపెట్టాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో అతడిని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అంతకుముందే మరో రెండు హత్యలు చేశాడని తెలియడంతో పోలీసులు షాకయ్యారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులను ఛేదించిన పాతపట్నం సీఐ రవిప్రసాద్‌, సారవకోట ఎస్‌ఐ రవికుమార్‌, హెచ్‌సీ సింహాచలం, పోలీసు కానిస్టేబుళ్లు కె.శ్రీను, రవికుమార్‌లను ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు.

Also Read: కారుణ్య ఉద్యోగం తండ్రిని చంపేసిన కొడుకులు.. తెలంగాణలో దారుణంSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *