sugar alternatives: పంచదార బదులు ఇవి తినొచ్చు.. – natural sugar substitutes to try for health benefits know here all details


పంచదార అన్న పదం వినగానేనే నోట్లో నీళ్ళూరతాయి, వెంటనే ఏదైనా తియ్యగా తినాలని అనిపిస్తుంది. మిట్ట మద్యాన్నం, అర్ధ రాత్రి, పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు, అసలే పనీ లేకుండా బద్ధకం గా కూర్చుని ఉన్నప్పుడూ తీపి మీదకి మనసు పోతుంది. శరీరానికి కార్బ్స్ కూడా కావాలి కానీ పంచదార తీసుకోవడం ఎక్కువైతే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువవుతుంది.

Also Read : బాత్‌రూమ్‌ని ఈజీగా క్లీన్ చేసేందుకు టిప్స్..

షుగర్ ఎక్కువైతే..

పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు అంటూంటారు. అవేమిటంటే,

1. అధిక బరువు కి దారి తీయవచ్చు
2. హార్ట్ డిసీజ్ కి కారణం కావచ్చు
3. యాక్నే సమస్య ఉండవచ్చు
4. టైప్ 2 డయాబెటీస్ రావచ్చు
5. కాన్సర్ కి కారణం కావచ్చు
6. డిప్రెషన్ కి లోనవ్వచ్చు
7. చర్మం ముడతలు పడుతుంది
8. శరీరంలో శక్తి అంతా తోడేసినట్లుగా ఉంటుంది
9. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రావచ్చు
10. డెంటల్ హెల్త్ కి అసలు మంచిది కాదు
11. జ్ఞాపక శక్తి తగ్గవచ్చు

Also Read : ప్రెగ్నెన్సీ టైమ్‌లో వీటి వాసన పీలిస్తే పుట్టబోయే బిడ్డకి డేంజరట..

అసలు ఎందుకు పంచదార తినాలని అనిపిస్తుంది..

  • పంచదారకీ సంతోషానికీ దగ్గర సంబంధముంది. షుగర్ తీసుకున్నప్పుడు శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది, ఇది మంచి ఫీలింగ్ ని ఇస్తుంది. ఈ ఫీలింగ్ కోసం ఇంకా షుగర్ తీసుకుంటాం.
  • కడుపు నిండింది, ఇంకేమీ తినక్కర్లేదు అని బ్రెయిన్ కి ఇంఫర్మేషన్ ఇచ్చే హార్మోన్ పేరూ లెప్టిన్. లెప్టిన్ ఈ పని చేయకుండా షుగర్ అడ్డుకుంటుంది, అందు వల్ల మనం ఇంకా ఇంకా తింటాం.
  • బ్రెయిన్ లో ఉండే హైపోథాలమస్ మనం ఎంత ఆహారం తీసుకుంటున్నాం అని గమనించుకుంటూ ఉంటుంది. షుగర్ ఈ యాక్టివిటీకి అడ్డం కొడుతుంది. అందువల్ల ఆకలి తీరినట్లు అనిపించకపోవడమే, షుగర్ క్రేవింగ్స్ కూడా మొదలవుతాయి. వెంటనే ఏదైనా స్వీట్ గా తినాలని అనిపిస్తుంది.
  • బాగా నీరసంగా అనిపించినప్పుడు, ఎక్కువ పని చేసినప్పుడు తీపి తింటే వెంటనే ఓపిక వస్తుంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు, నిలబడితే కళ్ళు తిరిగినట్లు అనిపించినప్పుడూ కూడా తీపి తింటే హాయిగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఒత్తిడి లేనిదెవరికి?
  • ఏడెనిమిది గంటల నిద్ర తరువాత శరీరంలో మెటబాలిజం రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఉత్సాహం గా ఉండదు, వెంటనే తీపి తిందాం అనిపిస్తుంది.
  • ఇవన్నీ మనకి ఒకటే చెప్తున్నాయి, సరైన సమయంలో సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకోవడం అవసరం, లేదంటే షుగర్ క్రేవింగ్స్ వస్తాయి అని.

Also Read : నేను ఇంటికొస్తే మా ఆయన వెళ్లిపోతున్నాడు.. నా కూతురు అలా చేస్తోంది..

ఎలా తగ్గించాలి..

1. పంచదార బదులు బెల్లం, తేనె వంటివి వాడడం, పంచదార వేసే స్వీట్స్ కాకుండా బెల్లం వేసే స్వీట్స్ చేసుకోవడం. అంటే రవ్వ కేసరి, చక్ర పొంగలి, పాయసం వంటి స్వీట్స్ బదులు సున్ని ఉండలు, నువ్వుల లడ్డూ వంటి స్వీట్స్ తీసుకోవడం
2. ఎక్కడ కుదిరితే అక్కడ పంచదార తగ్గించడం. మీ టీ లేదా కాఫీలో మీకు రెండు స్పూన్ల షుగర్ వేసుకునే అలవాటుంటే ఒక స్పూన్ కి మారడం.
3. తియ్యగా తినాలని అనిపిస్తోందా, వెంటనే ఏదైనా పండు తినండి. ఇందు వల్ల షుగర్ క్రేవింగ్ వెంటనే తగ్గిపోతుంది.
4. మనకి తెలియకుండా కూడా మనం షుగర్ తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి, బార్బెక్యూ సాస్, కెచప్ వంటివి. వీటిని వీలైనంతగా ఎవాయిడ్ చేయండి. వీటి బదులు ఇంట్లో చేసిన చట్నీ తీసుకోండి.
5. మీల్స్ మధ్యలో హెల్దీ స్నాక్స్ తీసుకుంటూ ఉంటే షుగర్ క్రేవింగ్స్ ఉండవు.
6. సాఫ్ట్ డ్రింక్స్ బదులు కొబ్బరి నీరు, మజ్జిగ, పంచదార కలపని స్మూతీలు, జ్యూసులు తీసుకోండి.
7. మీ బ్రేక్ ఫాస్ట్ పోరిడ్జ్ లో షుగర్ బదులు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష వంటివి యాడ్ చేసుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *