Talasani Srinivas Yadav: 14 వేల మంది సినీ కార్మికుల‌ కుటుంబాలకు మంత్రి తలసాని సాయం – telangana minister talasani srinivas yadav donating essential commodities to 14 thousand film workers


రెండు నెల‌లుగా క‌రోనా లాక్‌డౌన్ అన్ని పరిశ్రమ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్రభావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్షలాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో వేలాది మంది సంఘ‌టిత అసంఘ‌టిత సినీ కార్మికులు తిండికి లేక ఇబ్బంది ప‌డుతున్నార‌న్న గ‌ణాంకాల్ని సినీపెద్దలు గుర్తించారు. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ఏర్పాటుచేసి సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాల సాయం చేసిన సంగ‌తి తెలిసిందే. సీసీసీ సాయంపై ప‌రిశ్రమ వ‌ర్గాలు స‌హా అన్ని వైపుల నుంచి ప్రశంస‌ల వర్షం కురిసింది.

ఇదే కోవ‌లో సినీ-టీవీ కార్మికుల సాయం కోసం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ముందు‌కొచ్చారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం అందించేందుకు ప్రణాళిక‌ను సిద్ధం చేశారు. ఈ సేవా కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. సినీ, టీవీ కార్మికుల క‌ష్టాల‌పై త‌ల‌సాని ఇటీవ‌ల సినీపెద్దల స‌మావేశంలోనూ ఆరా తీసి నిత్యావ‌స‌రాల్ని సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Also Read:ఎన్టీఆర్ మూవీలో సమంత! నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అయ్యే అప్‌డేట్..

కరోనా మ‌హ‌మ్మారి ప్రభావం ఇత‌ర రంగాల‌తో పోలిస్తే సినీ రంగంపైనే అధికంగా ప‌డింది. టాలీవుడ్‌లో రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికుల‌కు జీత భ‌త్యాలు లేక అల్లాడుతున్నారు. అవ‌స‌రం మేర సినీ పెద్దల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకుని త‌న‌కు తానుగానే ఈ సేవా కార్యక్రమానికి త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులను ఇవ్వడానికి శ్రీ‌కారం చుడుతున్నారు. గురువారం మొద‌లు నిత్యం 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలు అందే వరకు ఈ సేవా కార్యక్రమం కొన‌సాగ‌నుంద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

samayam telugu

సినీ నటులతో తలసాని శ్రీనివాస్ యాదవ్Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *