tamil nadu daughter rape: కూతురిపై కన్నతండ్రి కామం.. మూణ్నెళ్లు నరకం.. గర్భం దాల్చడంతో.. – father rapes, impregnates teenage daughter in tamil nadu


కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కామంతో కన్నేశాడు. మైనర్ బాలిక పశువాంఛతో రెచ్చిపోయాడు. మూడు నెలలుగా నిత్యం నరకం చూపించాడు. బాలికకు కడుపునొప్పని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో తండ్రి అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. బాలికను పరీక్షించిన వైద్యులు కడుపుతో ఉందని చెప్పడంతో షాక్‌కి గురైంది. అందుకు కారణం తన తండ్రేనని తెలియడంతో ఆ తల్లి గుండె బద్దలైంది. ఈ అత్యంత అమానుష ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.

కూతురిపై కన్నతండ్రే అఘాయిత్యం చేసి గర్భవతిని చేసిన నాగపట్టిణం జిల్లాలో జరిగింది. మైలాదుత్తురైకి సమీపంలోకి సెంబనర్కోలి పట్టణానికి చెందిన కారు డ్రైవర్‌(40)కి ఇద్దరు కుమార్తెలు సంతానం. కామంతో కళ్లుమూసుపోయిన తండ్రి ఏకంగా కూతురిపైనే కన్నేశాడు. ఇంటర్ చదువుతున్న కూతురిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. పశువులా ఆమెపై పడి కామవాంఛలు తీర్చుకుంటున్నాడు.

Also Read: లేడీ కానిస్టేబుల్‌తో ఆ సంబంధం.. ప్రియుడిని చెట్టుకి కట్టేసి.. అమానుషం

బాలికకు కడుపులో నొప్పిగా ఉండడం.. వాంతులవడంతో తల్లి ఆమెను ఆప్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలిక కడుపుతో ఉందని చెప్పడంతో తల్లి షాక్‌కి గురైంది. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన కూతురిని చూసి గుండెలు బాదుకుంది. ఈ దారుణానికి పాల్పడిందెవరని నిలదీయడంతో బాలిక తండ్రి అకృత్యాన్ని బయటపెట్టింది. మూడు నెలలుగా నరకం చూపించాడని చెప్పడంతో తల్లి దిగ్భ్రాంతికి గురైంది.

కామంతో కన్నతండ్రే కూతురిని కాటేశాడని తెలుసుకున్న తల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కూతురిపై అత్యాచారం చేశాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులపై లైంగిక నేరాల కింద కేసులు నమోదయ్యాయి. నిందితుడిని అరెస్టు చేసి జైలుకి పంపించారు.

Read Also: పడక సుఖం కోసం పాకులాడిన మహిళ.. చివరికి.. కడప ‘చాందిని’ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *