పరీక్ష హాల్లో పురిటి నొప్పులు.. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో దారుణం వెలుగులోకి.

మైనర్ బాలికపై కన్నేసిన ఓ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. మనవరాలి వయసున్న బాలికను చెరబట్టి అకృత్యానికి పాల్పడేవాడు. తరచూ ఆమెపై పడి పశువాంఛ తీర్చుకోవడంతో బాలిక గర్భం దాల్చింది. ఆడుకోవాల్సిన పసి వయస్సులో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఎవరని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.


నామక్కల్ పరిధిలోని నామగిరిపెట్టై ప్రాంతానికి చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. తండ్రి ఐదేళ్ల కిందట అనారోగ్యంతో మరణించాడు. తల్లి కూలీ పనులు చేసుకుంటూ కూతురిని చదివిస్తోంది. ఈ క్రమంలో బాలిక ఇంటి పక్కనే ఉండే 70 ఏళ్ల వీరన్ కన్ను బాలికపై పడింది. మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చింది.

Also Read:
సవతి తల్లి తల తెగనరికిన కొడుకు.. చొక్కాపై రక్తం, చేతిలో కత్తితో స్టేషన్‌కి..

ఏడాది చివరి పరీక్షలకు హాజరవుతున్న బాలికకు కడుపునొప్పి రావడంతో బాత్రూమ్‌కి అని చెప్పి వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన టీచర్ బాత్రూమ్‌కి వెళ్లి చూసి షాక్‌కి గురైంది. బాలిక రక్తపు మడుగులో పడి ఉండడంతో కంగారు పడి ప్రధానోపాధ్యాయురాలికి విషయం చెప్పింది. తక్షణం స్పందించిన హెచ్‌ఎం బాలికను సేలంలోని మోహన్ కుమారమంగళం ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె ఇప్పుడు ఎనిమిది నెలల గర్భంతో ఉందని చెప్పడంతో నిర్ఘాంతపోయారు.

Read Also:
కరోనా కబళిస్తున్నా కాసుల కక్కుర్తి.. నీచంగా మాస్క్‌లను దాచేసి దారుణం.. సీజ్

బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆసరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలికను ఆరా తీయడంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి వీరన్ దారుణానికి ఒడిగట్టు తేలింది. దీంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడు. మైనర్ బాలికపై రేప్ కేసు నమోదు చేసి వీరన్‌ని జైలుకి పంపారు.


Also Read:

ఎక్కడికెళ్తున్నావ్ రాణి.. లేడీ జర్నలిస్టుతో పోలీసులు అసభ్యకరంగా..

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *