tamil nadu wife murder: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఊరిబయట బైక్ ఆపి.. – man kills wife by setting ablaze in tamil nadu


భార్యపై అనుమానం పెట్రోల్ పోసి తగటబెట్టిన అమానుష ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన భార్యాభర్తలు సురేష్, విష్ణుప్రియ చెన్నైలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. కొద్దికాలం సాఫీగానే సాగిన వారి కాపురంలో కలహాలు రేగాయి. భార్యపై అనుమానం పెంచుకున్న సురేష్ నిత్యం వేధింపులకు గురిచేసేవాడు.

భర్త వేధింపులు భరించలేకపోయిన విష్ణుప్రియ భర్తకి దూరంగా హాస్టల్‌లో ఉంటోంది. లాక్‌డౌన్‌తో అన్ని మూతపడడంతో తిరువణ్ణామలైలోని తమ స్వగ్రామానికి వెళ్దామని నమ్మబలికాడు. భార్యని బైక్‌పై ఎక్కించుకుని బయల్దేరాడు. ఆవడి పట్టణానికి సమీపంలోని మేళపాక్కం గ్రామం వద్ద బైక్ ఆపాడు. బండిలో నుంచి పెట్రోల్ తీసి అమాంతం భార్యపై పోసి నిప్పంటించాడు.

Also Read: తండ్రి పోయిన నెలకే తల్లి రెండో పెళ్లి.. అది నచ్చని కొడుకు..

ఒంటికి మంటలు వ్యాపించడంతో ఆమె అక్కడే కుప్పకూలింది. మంటల్లో కాలిపోతున్న విష్ణుప్రియని చూసిన స్థానికులు స్పందించి ఆమెను కిల్‌పాక్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ విష్ణుప్రియ ప్రాణాలు విడిచింది. హత్యానేరం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సురేష్‌ని అరెస్టు చేశారు.

Read Also: ఆంటీతో యువకుడి రాసలీలలు.. ఏకాంతంగా దొరికిపోవడంతో..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *