tax refund : Tax చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం! – modi govt to issue all pending i-t refunds upto rs 5 lakh with immediate effect


ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తాజాగా పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కరోనా వైరస్ దెబ్బకి దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ పేయర్స్‌కి ఊరట కలిగించే ప్రకటన చేసింది. పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ రిఫండ్స్‌ను వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.


రూ.5 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్స్‌కు ఇది వర్తిస్తుంది. జీఎస్‌టీ, కస్టమ్ రిఫండ్స్‌కు కూడా తాజా నిర్ణయం వర్తిస్తుందని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ‘కోవిడ్ 19 వల్ల నెలకొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట కలిగించేందుకు రూ.5 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ రింఫండ్స్‌ను, జీఎస్‌టీ/కస్టమ్ రిఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేస్తున్నాం’ అని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేర్కంది.

Also Read: ఆ ఆప్షన్‌తో PF డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.. ఎలా అంటే?


Also Read: కరోనా పాలసీతో రూ.2 లక్షలు.. ఉద్యోగం పోయినా, జీతం కట్ అయినా బేఫికర్!

కేంద్ర ప్రభుత్వపు తాజా నిర్ణయంతో ఏకంగా 14 లక్షల పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలుగనుంది. అన్ని జీఎస్‌టీ, కస్టమ్ రిఫండ్స్‌కు కూడా ఇది వర్తిస్తుంది. దీంతో ఎంఎస్ఎంఈ సహా లక్ష బిజినెస్ సంస్థలకు బెనిఫిట్ కలుగుతుంది. ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *