tcs q4 result : ఉద్యోగులకు శుభవార్త.. మీ జాబ్స్ సేఫ్ అంటున్న దిగ్గజ కంపెనీ! – tata consultancy services march quarter profit declines marginally to rs 8,049 crore


దేశీ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా జనవరి-మార్చి త్రైమాసికపు (2019-20, క్యూ4) ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఇందులో కంపెనీ నికర లాభం స్వల్పంగా తగ్గింది. 0.8 శాతం క్షీణించింది. రూ.8049 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంలో టీసీఎస్ లాభం రూ.8118 కోట్లుగా ఉండటం గమనార్హం.


టీసీఎస్ ఆదాయం విషయానికి వస్తే.. స్వల్పంగా పెరిగింది. త్రైమాసికం ప్రాతిపదికన రూ.39,854 కోట్ల నుంచి రూ.39,946 కోట్లకు ఎగసింది. 0.2 శాతం పెరుగుదల నమోదైంది. స్థిర కరెన్సీ రూపంలో టీసీఎస్ ఆదాయం 3 శాతం పైకి కదిలింది. ఆదాయ పెరుగుదలను గమనిస్తే.. లైఫ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ విభాగంలో 16 శాతం, కమ్యూనికేషన్స్ అండ్ మీడియా విభాగంలో 9.3 శాతం, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో 7 శాతం, రిటైల్ అండ్ సీపీజీ విభాగంలో 4.2 శాతం, టెక్నాలజీ అండ్ సర్వీసెస్ విభాగంలో 3.5 శాతం పెరుగుదల కనిపించింది. అయితే బీఎఫ్ఎస్‌ఐ విభాగం ఆదాయంలో మాత్రం 1.3 శాతం క్షీణత కనిపించింది.

Also Read: షాకిస్తున్న బంగారం ధర.. 8 రోజుల్లో రూ.2,170 పైకి.. ఈరోజు రేట్లు ఇలా!

2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే కంపెనీ నికర లాజభం 2.8 శాతం పెరుగుదలతో రూ.32,340కు చేరింది. ‘గత కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కంపెనీ ఉద్యోగుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అలాగే కీలకమైన క్లయింట్లకు సేవలు అందిస్తున్నాం’ అని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గోపీనాథన్ తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా సానుకూల అంశాలు కూడా ప్రతికూలముగా మారిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో పాజిటవ్ ట్రెండ్ కనిపించిన విభాగాల్లో ఇప్పుడు రివర్స్ అయ్యింది. ఈ త్రైమాసికంలో బలమైన డీల్స్ ఉడటం సానుకూల అంశం. కంపెనీ ఆర్డర్ బుక్ మునుపెన్నడూలేని విధంగా చాలా పెద్దగా ఉంది’ అని గోపీనాథన్ తెలిపారు. కాగా కంపెనీ షేరుకు రూ.6 తుది డివిడెండ్ ప్రకటించింది. అలాగే ఉద్యోగులను తొలగించమని పేర్కొంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *