telangana corona cases: తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు, 56కి చేరిన మరణాలు – 66 new coronavirus cases reported in telangana, toll surged to 1920, deaths reached to 56


త కొద్ది రోజులుగా తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు సోమవారం (మే 25) మరింతగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 66 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1920కి ఎగబాకింది. కరోనాతో సోమవారం మరో ముగ్గురు మరణించినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 56కు చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో మరో కేసు నమోదయ్యాయి. మొత్తం 66 కేసుల్లో 32 మంది తెలంగాణకు చెందినవారని మిగిలిన వారంతా రాష్ట్రేతరులని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. బాధితుల్లో 18 మంది విదేశీయులు ఉన్నట్లు వెల్లడించారు. 18 మంది వలస కార్మికులు, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు.

సోమవారం కరోనా నుంచి కోలుకొని 72 మంది డిశ్చార్జ్ అవడం విశేషం. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1164కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 700 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:ఫైళ్లతో పాటు కరోనా మోసుకొచ్చిన ఉద్యోగి.. రైల్ భవన్ రెండోసారి మూసివేత

Must Read:జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. హిమాచల్ ప్రదేశ్ సంచలన నిర్ణయం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *