telangana lockdown relaxation: రేపు ఉదయం నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సుల పరుగు: కేసీఆర్ – tsrtc buses starts from may 19 across telangana says cm kcr


ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం నుంచి బస్సులను నడిపించనున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు ఈ సడలింపు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే, నగరంలో క్యాబ్‌లు, ఆటోలకు అనుమతి ఇస్తున్నామని వెల్లడించారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఇవేవీ వర్తించబోవని చెప్పారు. ఆర్టీసీ బస్సులను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడిపిస్తారని చెప్పారు. సోమవారం కేబినేట్ భేటీ ముగిశాక, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఆర్టీసీకి అనుమతించిన క్రమంలో రోజూ బస్సులను శానిటైజ్ చేయడం సహా, ప్రయాణికులు, సిబ్బందికి మాస్కులు ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *