tips for fast pregnancy: ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఇలా చేయండి.. – here are 10 effective tips for trying to conceive


ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే స్త్రీలు మొట్టమొదటగా సలహా తన శరీరం గురించి, తన మెన్స్ట్రువల్ సైకిల్ గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి.. సైకిల్ రెగ్యులర్‌గా వస్తుందా తెలుసుకుంటే దాని ప్రకారం ఆమె ఆ రోజుల్లో కంపల్సరీ గా ఇంటర్ కోర్స్‌లో పాల్గొనేటట్లుగా ప్లాన్ చేసుకుంటుంది. ఇలాంటి మరికొన్ని విషయాల గురించి తెలుసుకోండి…

​1. పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండేలా..

samayam telugu

తల్లి కావాలనుకునే ప్రతి స్త్రీ తన సైకిల్ ని రికార్డ్ చేయాలి. అది ప్రతి నెలా సుమారుగా అదే డేట్స్ లో వస్తుంటే ఆ సైకిల్ ని రెగ్యులర్ సైకిల్ అంటారు. అలా కాకుండా చాలా తేడా ఉంటే అది ఇరెగ్యులర్ సైకిల్ అవుతుంది. ఈ ఇంఫర్మేషన్ ని ఒక కాలెండర్ లో నోట్ చేసి పెట్టుకుంటే తనెప్పుడు ఓవులేట్ అవుతుందో ఓ అంచనా కి రావచ్చు. ఓవులేషన్ అంటే ఓవరీస్ ఎగ్ ని రిలీజ్ చేసే టైం. ఈ ఎగ్ రిలీజ్ అయ్యాక పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకూ మాత్రమే ఫెర్టైల్ గా ఉంటుంది. కానీ, స్పెర్మ్ మాత్రం స్త్రీ శరీరంలో ఐదు రోజుల వరకూ ఉంటుంది.

​​2. ఓవులేషన్‌ గురించి తెలుసుకోండి..

samayam telugu

రెగ్యులర్ మెనుస్ట్రువల్ సైకిల్స్ ఉన్న స్త్రీ తన పీరియడ్ రావడానికి సుమారు పదిహేను రోజుల ముందు ఓవులేట్ అవుతుంది. కానీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న స్త్రీ లో దీని గురించి తెలుసుకోవాలంటేచాలా కష్టం. కష్టమే కానీ అసాధ్యం కాదు. కొన్ని పద్ధతుల ద్వారా నెలలో ఎప్పుడు ఉంటుందో అన్న విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ పద్ధతుల్లో ఒకటి హోం-ఓవులేషన్ ప్రెడిక్షన్ కిట్. ఇది మందుల షాపుల్లో దొరుకుతుంది. ఈ కిట్ యూరిన్ ద్వారా ఓవులేషన్ టైం లో ఇంక్రీజ్ అయ్యే ఒక హార్మోన్ లెవెల్ ని పరీక్షిస్తుంది. ఈ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చిన మూడు రోజుల తరవాత సెక్స్ లో పాల్గొంటే గర్భం ధరించే ఛాన్స్ పెరుగుతుంది.

రెండో పద్ధతి రెగ్యులర్ గా వైట్ డిస్చార్జ్ ని చెక్ చేసుకోడం. ఓవులేషన్ కి ముందు వైట్ డిస్చార్జ్ పల్చగా, క్లియర్ గా, జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఇది అలా ఉంటేనే స్పెర్మ్ ఈజీ గా ఎగ్ ని రీచ్ అవ్వగలుగుతుంది. ఇలా రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఆ టైం లో ఇంటర్ కోర్స్ లో తప్పనిసరిగా పాల్గొంటూ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి.

Also Read : లైంగిక కోరికలను ఆడవారు ఎలా కంట్రోల్ చేసుకుంటారంటే..

​3. రోజు విడిచి రోజు సెక్స్ లో..

samayam telugu

ఫెర్టైల్ విండో అంటే ఓవులేషన్ కి ఐదు రోజుల ముందు నుంచి ఓవులేషన్ రోజు వరకూ ఉన్న ఆరు రోజులు. నెలలో ఈ ఆరు రోజుల్నీ ఫెర్టైల్ విండో అంటారు. దీనిని ముందుగా చెప్పినట్లు కిట్ ద్వారా తెలుసుకునంది.. కొంతమంది న్యూ టెక్నాలజీ ద్వారా అందుబాటులో ఉన్న కొన్ని ఫెర్టిలిటీ యాప్స్ ద్వారా ఏది కన్సెప్షన్‌కి బెటర్ టైం అని తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకుని ఆ రోజుల్లో రోజూ కలిసినా, రోజు విడిచి రోజు కలవడం వల్ల ఒక నాలుగు శాతం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.

ఇందులో కొన్ని ముఖ్య విషయాలు కూడా ఉన్నాయి.. కేవలం ఆ టైం లో వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడకుండా ఉంటే చాలు. అది కూడా ఎందుకంటే వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వల్ల స్పెర్మ్ స్పీడ్ గా మూవ్ అవ్వలేదు.

​4. బరువు ఎంత ఉండాలంటే..

samayam telugu

ఓవర్-వెయిట్ ఉంటే పిల్లల్ని కనడం కష్టమంటారు. అండర్-వెయిట్ ఉంటే ఇంకా కష్టం. హెల్దీ వెయిట్ ఉన్నావారితో పోలిస్తే ఓవర్-వెయిట్ ఉన్నవారు రెండు రెట్లు ఎక్కువ టైం తీసుకుంటారు ప్రెగ్నెంట్ అవ్వడానికి. అయితే, అండర్-వెయిట్ ఉన్నవారికి నాలుగు రెట్లు ఎక్కువ టైమ్ పడుతుంది. కాబట్టి సరైన బరువుని మెయింటెయిన్ చేస్తూ ఉండండి..

​5. ప్రీ-నేటల్ విటమిన్ తీసుకోండి

samayam telugu

ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వారు డాక్టర్ సలహాతో ప్రీ-నేటల్ విటమిన్ కానీ, మల్టీ విటమిన్ కానీ తీసుకోడం మంచిది. ఈ మల్టీ-విటమిన్ లో ఫోలిక్ యాసిడ్, బీ విటమిన్ తప్పనిసరిగా ఉండాలి. ఇవి మీరు త్వరగా పిల్లలు కనేలా సాయపడుతుంది.

Also Read : దిండు పెట్టుకుని పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..

​6. హెల్దీ ఫుడ్..

samayam telugu

ప్రెగ్నెన్సీ కోసం ప్రత్యేకించి ఆహారమేమీ లేదు కానీ, బాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన అన్ని న్యూట్రియెంట్లూ అందుతాయి. కాల్షియం, ప్రొటీన్స్, ఐరన్ కావాల్సినంతగా శరీరానికి అందినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఆకుకూరలూ, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడంతో పాటూ కాఫీని ఒక కప్పుకి లిమిట్ చేయడం చాలా అవసరం.

7. కొన్ని వర్కౌట్స్ తగ్గించండి..

samayam telugu

ఫిజికల్ యాక్టివిటీ మామూలుగా ఉన్నప్పుడు ఎంతో మంచిది. కానీ, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న సమయం లో అంత స్ట్రెన్యువస్ వర్కౌట్స్ చేయకపోడమే మంచిది. ఈ వర్కౌట్స్ ఓవులేషన్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేస్తాయి. స్ట్రెన్యువస్ ఎక్సర్‌సైజెస్ చేసేవారిలో మెనుస్ట్రువల్ సైకిల్ సరిగ్గా ఉండదు. అందుకని ఆ వర్కౌట్స్ ని ఎవాయిడ్ చేయండి.

​8. వయసు పెరిగితే..

samayam telugu

వయసు పెరుగుతున్న కొద్దీ ఒవరిఎస్ రిలీజ్ చేసే ఎగ్స్ క్వాలిటీ, క్వాంటిటీ తగ్గుతాయి. పైగా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియసిస్, ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం లాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ప్రతి స్త్రీ కీ ఈ విషయంలో అవగాహన తప్పనిసరి. చాలా వరకూ చిన్న వయసులోనే పిల్లల్ని కనాలి.

9. స్మోకింగ్, డ్రింకింగ్‌ వద్దు..

samayam telugu

ఇవి భార్యా భర్తలిద్దరూ చేయకూడదు. ఈ ఇద్దరిలో ఎవరికి ఈ అలవాటు ఉన్నా పిల్లలు పుట్టే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి విషయాలకి దూరంగా ఉండడం మంచిది.

Also Read : ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు లెగ్గింగ్స్ వేసుకుంటున్నారా.. ఈ టిప్స్ మీకోసమే..

​10. మెడికల్ హెల్ప్ తీసుకోండి

samayam telugu

స్త్రీకి ముప్ఫై ఐదేళ్ళు పైబడి, ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఆరునెలలుగా సెక్స్ లో పాల్గొంటున్నా కూడా ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అవ్వకపోతే భార్యా భర్తలిద్దరూ ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఒక వేళ స్త్రీ కి ముప్ఫై ఐదేళ్ళ లోపే ఉంటే సంవత్సరం ట్రై చేసిన తరవాత మెడికల్ చెకప్ చేయించుకోవాలి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *