tips for food poisoning: పచ్చి కూరగాయలు తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.. – effective ways to prevent food poisoning


ఋతుపవనాలు మొదలై వానలు పడడం ప్రారంభించగానే అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఈ సంవత్సరానికి వేసవి కాలం నించి గట్టెక్కాం బాబూ అనుకున్నాం. కానీ, ఇలా వానలు మొదలయ్యాయో లేదో అలా జలుబూ, సీజనల్ ఫ్లూ, తలనొప్పి వంటివి మొదలైపోయాయి. అవి మన దాకా రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం మనందరి ప్రయారిటీ. ఎందుకంటే ఈ సమయం లో ఆహారం ద్వారా, నీటి ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువే.

Also Read : జలుబు, జ్వరం, వైరస్‌లు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలేమిటి?

కడుపు నొప్పి, వికారం, వాంతులు, డయేరియా, ఆకలి లేకపోవడం, జ్వరం, తలనొప్పి, నీరసం, డీహైడ్రేషన్, యూరిన్ లో బ్లడ్ పడడం, మాట్లాడడం లో, చూడడం లో ప్రాబ్లంస్ రావడం… ఇవన్నీ ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలే. ఇది వెంటనే ట్రీట్ చేయకపోతే ప్రాణాంతకమౌతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కనక దీని బారిన పడితే అబార్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. లివర్, కిడ్నీ ప్రాబ్లంస్, ఫిట్స్ వచ్చే అవకాశం పెరుగుతాయి.

పచ్చి కూరగాయలు తినొద్దు..

పచ్చి కూరగాయల మీద చాలా బాక్టీరియా ఉంటుంది. వీటిని శుభ్రం గా కడిగి వండిన తరవాతే తినాలి. కాలీఫ్లవర్, పాలకూర, బ్రకోలీ వంటి వాటిని ఉప్పు నీటిలో కడిగి మంచి నీటిలో కడిగితే వాటి లోపల ఉన్న బాక్టీరియా నశిస్తుంది. అన్ని కూరగాయల్నీ ఉప్పూ పసుపూ వేసిన నీటిలో కాసేపు ఉంచి, రన్నింగ్ వాటర్ కింద కడిగి, ఆరబెట్టి స్టోర్ చేసుకోవడం కూడా మంచి పద్ధతే. అలాగే, చాలా మంది వారానికి సరిపడా కూరలు కట్ చేసుకుని గాలి చొరని డబ్బాల్లో పెట్టి ఫ్రిజ్ లో ఉంచుతారు. ఇది మామూలుగా పరవాలేదు కానీ, వానాకాలం లో మాత్రం దీన్ని ఎవాయిడ్ చెయ్యగలిగితే మంచిది.

Also Read : కరివేపాకు జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా..

అందుకే ఈ వానాకాలంలో ఆహారం మీదా నీటి మీదా బాగా దృష్టి పెట్టాలి. నీరు ఫిల్టర్ చేసి తాగడం మంచిది. లేదా కాచి చల్లార్చి తాగాలి. బైట ఫుడ్ తినకపోతే ఫుడ్ పాయిజనింగ్ జరగదు అనుకుంటారు చాలా మంది. ఇది కొంత వరకూ కరక్టే. బైట ఫుడ్ తినకపోతే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాన్ని డెబ్భై శాతం తగ్గించవచ్చు. మిగిలిన ముప్ఫై శాతం కూడా తగ్గించాలంటే ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

ఆహారాన్ని జాగ్రత్తగా స్టోర్ చేయండి.

ఇంట్లో వండిన ఆహారం కూడా సరిగ్గా స్టోర్ చేయకపోతే ప్రాబ్లంస్ వచ్చే అవకాశం ఉంది. వండిన ఫుడ్ లో కొంత ఫ్రిజ్ లో పెట్టదల్చుకుంటే ఆ పని వెంటనే చేసేయాలి. వండిన ఆహారం రూం టెంపరేచర్ కి రాగానే తడి లేని పాత్ర లో పెట్టి గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్ లో భద్రపరచాలి. ఇలా దాచి ఉంచిన ఫుడ్ కూడా ఒకటి రెండు రోజుల్లో తినేయాలి.

శుభ్రత ముఖ్యం

వంట చేసేటప్పుడు అందరూ శుభ్రం గానే ఉంటారు. కానీ,వడ్డించేటప్పుడు కూడా చేతులు కడుక్కుని వడ్డించడం వల్ల ఆహారం లోకి ఎలాంటి బాక్టీరియా చేరకుండా ఉంటుంది. బాత్రూం కి వెళ్ళి వచ్చిన ప్రతి సారీ సబ్బుతో చేతులు కడుక్కోవడం కూడా ఈ కాలం లో మంచి పద్ధతే.

Also Read : జూలైలో ఏ పండ్లు, కూరగాయలు తింటే మంచిది.. ఏయే నెలల్లో ఏమేం తినాలంటే..

కట్ చేసిన కూరలూ, పండ్లూ కొనొద్దు

అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ ఇప్పుడు కట్ చేసి పెట్టిన కారెట్స్, బీట్రూట్ వంటివి దొరుకుతున్నాయి. వలిచిన వెల్లుల్లి కూడా దొరుకుతోంది. ఈ కాలం లో ఇవి వాడడం అస్సలు మంచిది కాదు. వీటిని ఇంటికి తెచ్చాక కడిగినా కూడా అందులోకి చేరిన బాక్టీరియా పోదు. అలాగే ఫ్రూట్ జ్యూసులు కూడా బైటవి తాగకండి.

వీటితో పాటూ ఆహారం లో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పసుపు వంటివి వాడడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. వీలైతే కొత్తిమీరా, పుదీనా ఇంట్లోనే పెంచుకోడానికి ట్రై చేయండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *