tips for marriage problems: పెళ్ళి వద్దంటున్న చెల్లికోసం అన్నయ్య ఏం చేశాడంటే.. – my sister doesn’t want to get married what will do know here all details


సమస్య: హాయ్..నేనొక ముప్ఫై రెండేళ్ళు. ప్రస్తుతం మా అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నాను. నాకు ఒక చెల్లెలుంది. తనకి ఇరవై ఎనిమిదేళ్ళు. తను వేరే సిటీ లో ఉంటోంది. తనని పెళ్ళి చేసుకోమని గత రెండు సంవత్సరాల నుండీ మేము అడుగుతూనే ఉన్నాము. కానీ, తను ఆ టాపిక్ ఎవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. తను ఎవర్నైనా ప్రేమిస్తోందేమో అని కూడా అడిగాం, ఒక వేళ అదే పరిస్థితైతే మేము అతన్ని కలవడానికి కూడా తయారుగానే ఉన్నాం. మాకు తన సుఖ సంతోషాలే ముఖ్యం. తనకి అలాంటి ఇష్టం ఎవరి మీదా లేదనీ, అలాంటి వాళ్ళెవరూ తన జీవితం లో లేరనీ చెప్పింది. తన పెళ్ళి గురించి మాట్లాడకపోతే ఫోన్ డిస్కనెక్ట్ చేస్తోంది. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. తనకి మా చెల్లెలి వయసే ఉంటుంది. తనకి వాళ్ళ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. తనకి ఈ సంవత్సరమే పెళ్ళి చేసేయాలని వాళ్ళ తాపత్రయం. వాళ్ళకి నా విషయంలో అభ్యంతరం ఏమీ లేదు. కానీ, ప్రాబ్లమ్ మా ఫ్యామిలీలోనే ఉంది. మా చెల్లెలి పెళ్ళి అయితేనే కానీ, నేను పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదని మా అమ్మా నాన్నలు అంటున్నారు. మా చెల్లెలు మాత్రం పెళ్ళికి సుముఖంగా లేదు. తను ఎందుకు పెళ్ళి వద్దంటోందో మాకెవరికీ చెప్పట్లేదు. తన పెళ్ళి అయితేనే కానీ నాకు మ్యారేజ్ జరగదు. నేను ఇష్టపడ్డ అమ్మాయికి వాళ్ళ వాళ్ళు ఈ సంవత్సరం పెళ్ళి చేసేద్దామన్న తొందరలో ఉన్నారు. నేనేం చేయాలి? నేను ఇష్టపడ్డ అమ్మాయిని వదులుకోలేను. మా చెల్లిని పెళ్ళికి ఒప్పించలేను. ఈ పరిస్థితిలో నేనేం చేయాలో తెలియట్లేదు. దయచేసి నాకు సాయం చేయండి. మా చెల్లిని ఎలా పెళ్ళికి ఒప్పించాలి?

Also Read : ఈ రాశి వారిని పెళ్ళి చేసుకుంటే ఎలాంటి గొడవలు రావట..

నిపుణుల సలహా:
హాయ్.. మాతో మీ సమస్య పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకు ఇష్టమైన అమ్మాయిని మీ కుటుంబ సమస్యల వల్ల పెళ్ళి చేసుకోకుండా ఉండడం ఎంత కష్టమో నేను అర్ధం చేసుకోగలను. మీరు మీ చెల్లెలి సంతోషం కోసమే ఆలోచిస్తున్నారని అర్ధమౌతోంది కానీ, మీ చెల్లికీ, మీ కుటుంబ సభ్యులకీ మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమో అని అనుమానంగా ఉంది.

Also Read : బ్రతికి ఉన్నప్పుడే కళ్ళు దానం చేయొచ్చా..

మీరు మీ చెల్లెలితో ఓపెన్ గా, తప్పొప్పులు ఎంచకుండా మాట్లాడండి. ఆమె ఎందుకు పెళ్ళి వద్దంటోందో, కారణాలేంటో తెలుసుకోండి. సమస్యని ఆమె వైపు నుండి అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి. చాలా సార్లు పెళ్ళి విషయంలో అమ్మాయిల్ని కుటుంబం నుంచి ఎక్కువ ప్రెషర్ ఫేస్ చేస్తారు. వీరు ఎందుకు పెళ్ళి వద్దంటున్నారో వీరి సమస్య ఏమిటో ఫ్యామిలీ మెంబర్స్ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించరు. మీకు తను ఆనందంగా సంతోషంగా ఉండాలని ఉంది అన్ని విషయం మీ చెల్లెలికి చెప్పండి. అలాగే, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ గురించి కూడా ఆమెతో చర్చించండి.

Also Read : మలేరియా వచ్చాక ఈ ఫుడ్ తింటే త్వరగా కోలుకుంటారట..

మీరు కూడా పెళ్ళి విషయంలో పేరెంట్స్ నుండి ప్రెషర్ ఫేస్ చేస్తున్నారని చెప్పండి. అలాగే, మీరు మీ చెల్లెలిని కన్విన్స్ చేయడం కంటే కూడా మీ అమ్మా నాన్నలని కన్విన్స్ చేయడానికి మీ శక్తిని ఉపయోగించండి. ఇది చెప్పడం తేలిక, చేయడం కష్టం, అయినా కూడా మీ ఇద్దరి ఆలోచనలు వేరు వేరనీ, ఒకరి పర్సనల్ లైఫ్ ఇంకొకరి ఫ్యూచర్ ని డిక్టేట్ చేయకూడదనీ మీ పేరెంట్స్ కి నచ్చచెప్పడానికి ట్రై చేయండి. ఇది మీకు కొంచెం హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. స్టే హోమ్ స్టే సేఫ్.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *