tips for romance: మీ లైఫ్ రొమాంటిక్‌గా మారాలంటే ఇలా చేయండి.. – how can improve romance in life know here details


ప్రేమబంధాలు చాలా గమ్మత్తుగా ఉంటాయ్. మొదట్లో ఎంతో సరదాగా, అందంగా అనిపించిన అనుబంధం కాలం గడిచేకొద్దీ మామూలుగా అయిపోతుంది. దీనికి కారణం ప్రేమ భావన తగ్గడం కాదు. జీవితంలో బాధ్యతలు. జీవితం ఇంతేలే అనీ ఊరుకోకుండా కొంచెం సహనంతో, కొంచెం ఆలోచనతో మాములుగా సాగిపోతున్న మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు. ఈ లాక్ డౌన్ టైమ్‌లో మీ ప్రేమబంధాన్ని పంచుకోవడానికి కొన్ని టిప్స్ ఇక్కడ మీకోసమే..

1. సర్‌ప్రైజెస్ ఇవ్వండి..

ఒకరిమీద ఒకరికున్న ప్రేమని కొత్త కొత్త పద్ధతుల్లో తెలియచెప్పడానికి ఇదొక మంచి అవకాశం. మీ హడావిడి జీవితాల్లో పడి మర్చిపోయిన ఉత్సాహానీ, సరదానీ గుర్తుకు తెచ్చుకోండి. కొన్ని కొన్ని సరదాలు అద్భుతమైన మెమొరీస్‌లా మిగిలిపోతాయి. అందుకే అనేక పద్ధతుల్లో మీ ప్రేమని పంచుకోండి.

samayam telugu

Young happy couple on beach at summer vacation

Also Read : బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా..

2. ప్రయోగాలు కూడా..

మార్పు లేకుండా నడిచిపోతున్న జీవితాల్లో కొత్తదేదైనా సరే ఉత్సాహంగా ఉంటుంది. మీ జీవితం మీకు విసుగ్గా అనిపిస్తుంటే కొత్త విషయాలతో ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం. మీకు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేయండి.. మీ భాగస్వామి కోసం మీరేదైనా కొత్తగా ఆలోచించింది కావచ్చు. మీరు ప్రయత్నించింది మీకు నచ్చిందనుకోండి, అది అద్భుతం. ఒకవేళ నచ్చలేదనుకోండి, మీ ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి నవ్వుకోవచ్చు. దాని ఫలితం ఏదైనా కొన్ని మంచి జ్ఞాపకాలను మాత్రం మీరు నెమరు వేసుకోవచ్చు.

3. ఫోన్‌ని దూరంగా పెట్టండి..

ఈ డిజిటల్ యుగంలో మన దృష్టి మరల్చడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి. ఆ మాయలో పడితే విసుగ్గా మారిన జీవితాన్ని తిట్టుకుంటూ కూర్చుంటామే తప్ప దాన్ని బాగు చేసుకునేందుకు మన వంతు ప్రయత్నం కూడా మనం చేయం. కాబట్టి, మీరు నిజంగా మీ బంధాన్ని మరింతం అందంగా మార్చుకోవాలనుకుంటే.. ఒకరినొకరు అర్ధం చేసుకోడానికీ, ఒకరి గురించి ఒకరు ఆలోచించడానికీ ప్రయత్నించండి. అంతే కానీ, ఫోన్స్‌లో ఫొటోలు చూస్తూ టైమ్ వేస్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల జీవితం చిరాగ్గానే మిగిలిపోతుంది. మనం దేని గురించి ఆలోచిస్తామో అదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మర్చిపోకండి.

samayam telugu

couple romance

Also Read : ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా..

4. కలిసి ప్లాన్స్ వేస్కోండి.

ఇద్దరూ కలిసి ఒక టూర్‌కి వెళ్దామనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళొద్దామనుకున్నా, ఏదైనా చేద్దామనుకున్నా ఉండే ఉత్సాహం ఇంకోలా రాదు. ఇలాంటి విషయాలతోనే మీ ప్రేమబంధం గట్టిపడుతుందని గుర్తుంచుకోండి. మీ ఇంట్లోనే మీరు ఒక కాండిల్ లైట్ డిన్నర్‌ని ప్లాన్ చేసుకోండి. ఇలా ఓ మంచి వాతావరణాన్ని మీ ఇంట్లో మీ ఇద్దరే కలిసి ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా సరదాగా ఓ ‌టూర్‌కి ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు ఏం చేశారన్నదాని కంటే కూడా అది మీ ఇద్దరూ కలిసి చేయడమే జీవితంలో మంచి మెమొరీస్ ఉండేలా చేస్తుంది. జీవితానికి సరిపడా మధుర స్మృతులని అందిస్తుంది. లాక్ డౌన్ తరవాత మీరనుకున్న టూర్స్ చేసుకోవచ్చు కూడా..

Also Read : ఆలివ్ ఆయిల్‌తో రోజూ వంట చేయొచ్చా..

5. శృంగార జీవితం మొదట్లో సరసాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరినొకరు ఆట పట్టించడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. కానీ, రోజులు గడిచే కొద్దీ ఇవన్నీ తక్కువ అవుతాయి. వీటన్నింటినీ మీరు ఇప్పుడు కూడా చేయొచ్చు. ఇలా రొమాంటిక్‌గా మాట్లాడుకోవడం వల్ల లైఫ్‌లో కొన్ని మధురక్షణాలు మీ లైఫ్‌లో ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటిని పాటించి మీ జీవితాన్ని ఆనందంగా చేసుకోండి..మీ ఊహకు పదును పెట్టండి. మీ జీవితానికి రసపట్టాభిషేకం చెయ్యండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *