Today Rasi Phalalu: Mulugu Horoscope: మే 3 రాశి ఫలాలు- మీన రాశివారికి శ్రమకు తగిన ఫలితం! – pisces zodiac sign people will success mulugu daily rasi phalalu 3rd may 2020


మేషం
ప్రారంభించిన వ్యవహారాలు, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి.

వృషభం

సన్నిహితులతో ఏర్పడిన మాటపట్టింపులు, వివాదాలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరడంతో ఊరట లభిస్తుంది. అనుకొని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

మిథునం
ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడతారు. బుణాలు కొంత వరకు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటకం

దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం కుటుంబంలో అనందానికి కారణమవుతుంది. ఆప్తుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

సింహం

ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు. కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

కన్య

దూరపు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే సూచనలు గోచరిస్తున్నాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. గౌరవ, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. మిత్రులను కలుసుకుంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Read Also: Mulugu Panchangam: మే 3 ఆదివారం.. తిథి దశమి, పుబ్బ నక్షత్రం
తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సామాజిక, సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం

దూర ప్రాంతాల నుంచి కీలక నమాచారం అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలులో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

ధనున్సు

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆస్తివివాదాలు పరిష్కార దశకు చేరుకోవడంతో మానసిక ప్రశాతంత పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వాహానాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు.

మకరం

మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎనిమిది శనివారాలు నలుపువత్తులతో శనీశ్వరునికి దీపారాదన చేయండి.

కుంభం
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రుణాల తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. పెరిగిన బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేసినా సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు.

మీనం

కొత్త కార్యక్రమాలలో సన్నిహితుల సహాయం అందిస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుతుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *