trains for migrants: చేతిలో చంటి బిడ్డతో వలస మహిళ సాహసం.. రైలు పెట్టెల మధ్యలో ప్రయాణం – a migrant lady travels with her child to sit between two coaches of a train


కరోనా వైరస్ వల్ల విధిస్తున్న లాక్ డౌన్‌ ప్రభావం వలస కూలీలపై తీవ్రంగా పడుతోంది. ఉన్న చోట బతకలేక తిరిగి సొంతూర్లకు వెళ్లేందుకు వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. చంకలో చంటి బిడ్డలను, బరువులను తలపై మోసుకుంటూ వందల కిలోమీటర్లు వారు సాగించే పాదయాత్ర కన్నీరు పెట్టిస్తోంది. గర్భిణులు, పెద్దవారు అనే తేడా లేకుండా సుదూరు ప్రాంతాలు నడక సాగిస్తున్నారు. కొందరు మధ్యలోనే తనువు చాలిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన శ్రామిక్ రైళ్లు అందుబాటులో లేని ఎంతో మంది ఈ అవస్థలు పడుతూనే ఉన్నారు.

తాజాగా ఓ మహిళ రైలు పెట్టెల మధ్యలో కూర్చొని ప్రయాణిస్తుండడం కంటతడి పెట్టిస్తోంది. పైగా చేతిలో రోజుల వయసున్న చంటి బిడ్డ ఉన్నాడు. వేగంగా కదులుతున్న రైలు పెట్టెల మధ్యలో ఆమె బిక్కు బిక్కుమంటూ కూర్చొని ఉంది. దీనికి సంబంధించిన వీడియోను హైదరాబాద్‌కు చెందిన ఓ ఐపీఎస్ అధికారి ట్వీట్ చేశారు. ఆ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందో తెలియక పోయినా దీనావస్థలో ఉన్న వలస కూలీల కష్టాలకు అది అద్దం పడుతోంది.

Also Read:

ఇద్దరు సీఎంలు కుమ్మక్కైయ్యారు.. ఏపీ తీరుపై ఉత్తమ్ ఫిర్యాదు

ఐపీఎస్ అధికారి ఇలా ట్వీట్ చేశారు. ‘‘మిత్రులారా, ఈ వీడియో చూడగానే చలించిపోయి పోస్ట్ చేయడం జరిగింది. ఇది కాలానికి, ప్రాంతానికి అతీతమైనది. ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి అని తెలియని తరానికి తెలియజేసే ప్రయత్నం. టికెట్ లేకుండా పట్టుబడటం వల్ల కలిగే అవమానంకన్నా, ప్రాణం పోయినా ఫరవాలేదు అనుకున్న ఆ తల్లి కళ్లలో తెగింపు చూడండి’’

‘‘ఎంత కష్టమొచ్చింది తల్లీ నీకు! నా మనస్సు తల్లడిల్లింది నీ అవస్థ చూసి. ఎందుకు ఈ అభివృద్ధి ఎందుకు ఈ సంపద. నాకు దుఃఖం ఆగటంలేదు. అన్నీ ఉన్నా నీకేమి చేయలేకపోతున్నా. నన్ను క్షమించు తల్లీ.’’ అని ట్వీట్ చేశారు.

Also Read:

జగన్ మోసానికి మేం పైఎత్తు వేస్తాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

samayam telugu



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *