ఉగాది పచ్చడి తింటే ఎలాంటి సమస్యలు రావా?

కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ చేసుకునే పండుగ. జనవరి 1 న కొత్త సంవత్సరం చేసుకోవడం ఇంగ్లీష్ వారి ఆచారం. మనకి మాత్రం చైతర శుక్ల పాడ్యమి నాడు మాత్రమే ఈ పండుగని చేసుకుంటారు. ఈ రోజున తెలుగువారు కచ్చితంగా ఉగాది పచ్చడిని చేసుకుంటారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు ఇలా రుచులు కలిగిన పచ్చడే ఈ రోజున ప్రసాదం. ఈ ప్రసాదం మన జీవితంలోని ప్రతి ఒక్కో అనుభూతికి అంకితం అయ్యేలా ఉంటుంది. ఈ షడ్రుచులే జీవితంలో అన్ని విషయాలను తెలియజేస్తాయి. తీపి అంటే ఆనందం, చేదు అంటే కొన్ని బాధలు.. ఇలా ప్రతి ఒక్క రుచి ఒక్కో అనుభూతిని వ్యక్త పరుస్తుంది.


Also Read : డేంజర్ మరో కొత్త వైరస్.. క్షణాల్లోనే ప్రాణాలే పోతున్నాయ్.. జాగ్రత్త..

ఉగాది పచ్చడని శాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోకకళికా ప్రాశనం’ అని పిలుస్తారు. దీనిని తీసుకోవడం వల్ల రుతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తింటారు. ఈ పచ్చడిలో వాడే ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, కారం ఇలా అన్ని రుచులను ఇచ్చే పదార్థాలతో కలిపి చేస్తారు. ఈ పచ్చడిని ఇంట్లో వారంతా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. దీని వల్ల సంవత్సరమంతా ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు నిపుణులు.


వేప..

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వేపపువ్వు బుధుడికి సంబంధించినవి. ఇందులో వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. రుతు మార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ, అమ్మవారు, కలరా, మలేరియా రాకుండా కాపాడుతుంది. ఇది యాంటీ వైరస్ గా కూడా పనిచేస్తుంది. గుమ్మానికి వేపాకులు కట్టడం వల్ల కలుషితం లేని స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. వేప పువ్వుని పచ్చడిలో వేసుకుని తతాగితే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే వాడతారు.

Also Read : ప్రెగ్నెంట్స్ మీరు ఇవి కచ్చితంగా కొనాల్సిందే..

మామిడి..

అదే విధంగా మామిడి ముక్కల్లో తీపి, పులుపుతో పాటు వగరు గుణముంటుంది. ఆరోగ్యవంతమైన చర్మాన్ని గుణం మామిడిలో పుష్కలంగా ఉంటుంది. మామిడి ముక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అదే విధంగా చితుపులుపు మనిషిలో ఆలోచనా శక్తిని పెంచుతుంది. ఈ కారణంగా టెన్షన్, హడావుడి లేని జీవితాన్ని గడుపుతారు.

అరటిపండు..

చాలా మంది ఈ పచ్చడిలో అరటిపండు, చెరుకు ముక్కలని కుూడా కలుపుతారు. అరటిపండుల్లో శరీరానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉంటాయి. దీని వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీంతో పాటు… చెరకకు ముక్కల్లో పీచు పదార్థం ఉంటుంది.

Also Read : వర్క్ ఫ్రమ్ హోమ్‌లో హెల్త్ బాగోకపోతే లీవ్ తీసుకోవచ్చా..

అదే విధంగా, ఇందులో కలిపే ఉప్పు, కారంలోనూ శరీరానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి. అందుకే వీటన్నింటిని ఉపయోగించి ఉగాది పచ్చడి చేస్తారు. దీని వల్ల సీజనల్ సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి. ఇలా భారతదేశంలోనే చేసే ప్రతి పనికి ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగానూ ఎన్నో గుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పచ్చడిని చేసుకుని ఇంటిల్లిపాది తాగి ఆ అద్భుత ప్రయోజనాలని పొందండి..

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *