uncensored season 2: దిగ్గజ నిర్మాతపై రాజాసింగ్ ఫైర్.. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు – mla raja singh files complaint on producer ekta kapoor in hyderabad


బాలీవుడ్‌లో దిగ్గజ నిర్మాత, బాలాజీ టెలీ ఫిలిమ్స్ అధినేత అయిన ఏక్తా కపూర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలాజీ టెలీ ఫిలిమ్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ‘అన్ సెన్సార్డ్ సీజన్‌-2’ అనే వెబ్ సిరీస్ ట్రైలర్‌ విడుదలైంది. అయితే, ఈ ట్రైలర్‌లో భారత ఆర్మీ యూనిఫామ్‌ను కించపరిచేలా సన్నివేశాలున్నాయని విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ను కలిసి నిర్మాత ఏక్తా కపూర్‌పై ఫిర్యాదు చేశారు. ఆర్మీ యూనిఫాం కించపర్చేలా ఉన్నందున ఆ వెబ్ సిరీస్ నిర్మాత ఏక్తాపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ ఫిర్యాదులో కోరారు.

అనంతరం ఆయన మాట్లాడారు. బాలాజీ టెలీ ఫిలిమ్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ సరిహద్దుల్లో రక్షణగా నిలుస్తున్న సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆ ట్రైలర్‌, వెబ్ సిరీస్‌ను రూపొందించారని విమర్శించారు. ఈ వ్యవహారంలో నిర్మాత అయిన ఏక్తా కపూర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాక, ఇదే అంశంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు హైదరాబాద్‌కు చెందిన విశాల్‌ కుమార్‌ అనే యువకుడు కూడా సోమవారం ఫిర్యాదు చేశాడు. ఆర్మీ యూనిఫామ్‌ను అపహాస్యం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో ఈ ట్రైలర్ విడుదల చేశారని పేర్కొన్నాడు.

Also Read:

గాలివానకు నల్గొండలో మాయమైన దుకాణం.. అయోమయంలో యజమానిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *