up woman harassment: భార్యను వేశ్యగా చిత్రీకరిస్తూ సోషల్‌మీడియాలో ఫోటోలు… నీచానికి పాల్పడిన భర్త – up man arrestes over wife’s photos and phone number posts in social media over dowry harassment


దేశంలో మహిళలపై అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడదాన్ని అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారు కొందరు దుర్మార్గులు. ముఖ్యంగా సోషల్‌మీడియా వ్యాప్తి పెరిగాక ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులతో పాటు సొంతవాళ్లే ఇలాంటి నీచపు పనులకు పాల్పడటం మరింత ఆందోళన పరుస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ నీచుడు తన భార్యను వేశ్యగా చిత్రీకరిస్తూ ఆమె ఫోటోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెతో లైంగిక సుఖం కావాల్సిన వారు సంప్రదించాలంటూ ఫోన్ నంబర్‌ కూడా ఇచ్చాడు. దీంతో ఆ మహిళ బ్రతుకు బజారున పడింది.

Also Read: డబ్బుల కోసం యువకుడి నీచం.. ప్రియురాలి‌ న్యూడ్ వీడియోలు సోషల్‌మీడియాలో

వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని అజాంగఢ్ జిల్లా తుతియా గ్రామానికి చెందిన పునీత్(26)కు కొత్వాలీకి చెందిన మహిళతో ఏడాది కిందట వివాహమైంది. పెళ్లి సమయంలోనే కట్నంతో పాటు బైక్ ఇస్తానని అత్తింటి వారు అతడికి మాటిచ్చారు. అయితే ఏడాది గడిచిపోయినా బైక్ ఇవ్వకపోవడంతో పునీత్ భార్యను వేధించటం మొదలుపెట్టాడు. రోజూ ఆమెను సూటిపోటి మాటలతో వేధించడంతో పాటు తీవ్రంగా కొట్టేవాడు. భర్త చిత్రహింసలు భరించలేకపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యపై కక్షగట్టిన పునీత్.. ఆమె ఫోటోలను సోషల్‌మీడియోలో పోస్ట్ చేసి వేశ్యగా చిత్రీకరించాడు. ఆమెతో పడక సుఖం కావాలంటూ సంప్రదించాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చాడు. దీంతో అప్పటినుంచి అనేక మంది ఆమెకు ఫోన్ చేసి.. నీ రేటెంత? అంటూ వేధించడం మొదలుపెట్టారు.

Also Read: ప్రియుడితో పెళ్లి ఫోటోలు వైరల్…. కాబోయే భర్తకు తెలిసిపోయిందని యువతి ఆత్మహత్య

రోజూ వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తుండటంతో విసిగిపోయిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న అజాంగఢ్ ఎస్పీ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బాధితురాలు భర్తపైనే అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడిని కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు. పునీత్‌కు కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: పనికోసం వచ్చిన బాలికపై కామం.. వ్యభిచారంలోకి దించి… ఆపై గ్యాంగ్ రేప్Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *