vanisri son suicide: వాణిశ్రీ కొడుకు మృతిలో ట్విస్ట్.. గుండెపోటు కాదు, ఆత్మహత్య! – telugu senior actress vanisri son abhinay venkatesh commit suicide


సీనియర్ నటుడు నటి వాణిశ్రీ కొడుకు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తీక్ (36) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అయితే ఈయన గుండెపోటుతో మరణించినట్టుగా మొదట వార్తలు రాగా.. ఆయనది ఆత్మహత్య అని తెలుస్తోంది. బెంగుళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్న అభినయ్ వెంకటేష్ కార్తీక్ ఆత్మహత్య చేసుకోవడంతో.. తిరుక్కలి కుండ్రం పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మరణంగా కేసు నమోదైంది.

కొడుకు మరణంతో వాణిశ్రీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన.. ప్యాలెస్ పనులు నిమిత్తం చెంగల్ పట్టుకువెళ్లారు. అయితే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన వెంకటేష్.. ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అభియన్‌కు భార్య, ఓ కుమారుడు (4) ఉన్నాడు. ఆయన భార్య కూడా వైద్యురాలే. అభినయ్ వెంకటేష్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకుని వచ్చారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వాణి శ్రీ కొడుకు మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. వాణి శ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *