Varavara Rao: జైల్లో వరవరరావుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు, హైదరాబాద్‌లో ఆందోళన – poet varavara rao admitted in mumbai jj hospital with ill health


విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు (80) అస్వస్థతకు గురయ్యారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు, ఎల్గార్‌ పరిషద్‌ – మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టై మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న ఆయన శుక్రవారం (మే 29) అస్వస్థతకు గురైనట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఆయణ్ని నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

వరవరరావును ఉంచిన జైల్లోని కొందరు ఖైదీలు కరోనా వైరస్ బారినపడ్డట్లు తెలియడంతో ఇప్పటికే కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో ఒక ఖైదీ మరణించినట్టు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో 80 ఏళ్ల వయసులో ఉన్న తమ తండ్రిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని వరవరరావు కుమార్తెలు సహజ, అనల, పవన మహారాష్ట్ర గవర్నర్‌కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

తప్పుడు అభియోగాలతో తమ తండ్రిని అరెస్టు చేసి జైల్లో పెట్టారని వరవరరావు కుమార్తెలు ఆరోపించారు. కొవిడ్-19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడనే వార్త తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని లేఖలో వారు పేర్కొన్నారు. వరవరరావు ఆరోగ్యంపై హైదరాబాద్‌లోని ఆయన కుటుంబసభ్యులతో పాటు బంధువులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వరవరరావు అనారోగ్యానికి గురైన సమాచారాన్ని చిక్కపడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు అందించినట్టు పుణే పోలీసులు తెలిపారు.

Also Read:మిడతలతో కొత్త ముప్పు.. విమానాలకూ ప్రమాదం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *