Vastu Tips for Plot Selection: ఇల్లు కొంటున్నారా.. అయితే, ఇలాంటి ఇంటిని అస్సలు కొనొద్దు.. – how do know vastu compliant a residential plot


1. స్థిరాస్తి కొంటున్నారా?

ప్రస్తుతం స్థిరాస్తుల ధరలు మునుపెన్నడూ లేనంత తక్కువగా ఉండడంతో, చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఆస్తి కొంటున్నప్పుడు కొనేవారికీ, అమ్మేవారికీ ఇష్టమైన ఒప్పందం కుదరటం అన్నిటి కన్నా ముఖ్యం. అదే సమయంలో వాస్తు నిపుణులు ఏమంటున్నారో కూడా తెలుసుకోండి. వంటగది ఎటువైపుంది, బాత్రూములు ఎటువైపు కట్టారు. ధారాళంగా గాలి వెలుతుర వస్తున్నాయా లాంటి విషయాలతో పాటూ.. ఇంకా కొన్ని విషయాలని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ జీవితంలో తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం కోసం కొన్ని సూచనలు.

samayam telugu

home decor times of india 1

2. చరిత్ర అవసరం

కొత్త ఇల్లు కొనుక్కోడం ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే దానికి ఎలాంటి చరిత్ర ఉండదు. ఒకవేళ మీరు ఎవరో అమ్ముతూ ఉన్న ఇంటిని కొనాలనుకుంటే, అమ్మేవారు ఎందుకు అమ్ముతున్నారో కనుక్కోండి. ఇంకో పెద్ద ఇంట్లోకి వెళ్తున్న వారి దగ్గర నుంచో, జీవితం లో విజయశిఖరాలధిరోహిస్తున్న వారి దగ్గరనించో కొనండి.

Also Read: సూపర్బ్ హెయిర్ బ్యూటీ టిప్‌ని షేర్ చేసిన ప్రియాంక చోప్రా..

3. ఇంటితో పాటూ సమస్యలు కూడా కొంటున్నారా, చూడండి

ఇంట్లోని వారు విడాకుల వల్ల గానీ, వ్యాపారంలో నష్టపోయి గానీ, తీవ్రమైన అనారోగ్యంతో గానీ ఇల్లు అమ్ముతుంటే అది కొనడం అంత మంచిది కాదు. అలాంటి ఇల్లు కొంటున్నారంటే ఆ సమస్యలు కూడా కొంటున్నారని అనుకోవచ్చు. ఆ ఇల్లు అలాంటి ప్రతికూల పరిస్థితులని కూడా తీసుకుని ఉంటుంది కాబట్టి, వీలున్నంత వరకూ అలాంటి ఇల్లు కొనకండి.

4. మీరు ఎవరైనా ఉండి వెళ్ళిన ఇల్లు కొంటుంటే, మీరు అందులోకి వెళ్ళే ముందు, ఆ ఇంటిని ఆవరించుకుని ఉన్న రకరకాల భావనా తరంగాలని తొలగించడం మంచిది. ఇది ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం వల్ల, కొత్తగా రంగులు వేయించడం వల్ల, ఇంట్లో అప్పటికే ఉన్న వస్తువులని తీసెయ్యడం వల్ల జరుగుతుంది. ఇదే పనిని మీరు పురోహితుల చేత కూడా చేయించుకోవచ్చు.

Also Read: లో దుస్తులు లేకుండా పడుకుంటే ఏమవుతుందో తెలుసా..

5. స్థలం యొక్క ఆకారం

సరైన ఆకారం లేని స్థలం గానీ, ఇల్లు గానీ మంచివి కావు. అవి వాటి సొంతదారుల జీవితాలను కూడా సరిగ్గా ఉంచవు. చదరపు ఆకారంగా గానీ, దీర్ఘ చతురస్రాకారంలో గానీ ఉన్న స్థిరాస్తి ఎప్పుడూ మంచి చేస్తుంది.

samayam telugu

home decor times of india 5

6. ప్రవేశం ముఖ్యం

ఇల్లు కొనేటప్పుదు ఇంటికి ఎలా వెళ్తామూ అన్నది గమనించండి. ఇల్లు రోడ్డుకి ఎదురుగా ఉన్నా, టీ-జంక్షన్ వద్ద ఉన్నా వాస్తు ప్రకారం అస్సలు మంచిది కాదు. అయితే ఇది తప్ప మిగిలినవి అన్నీ చాలా బావుంటే కనుక చిన్న చిన్న మార్పులేమైనా చేసుకోగలరేమో నిపుణులని సంప్రదించండి.

Also Read: శృంగార సమయంలో లూబ్రికెంట్స్ వాడుతున్నారా..

7. ఇల్లు దేన్ని చూస్తోంది?

ఇంటికెదురుగా విశాలమైన స్థలం ఉన్నా, ఇంటికి తూర్పు, ఉత్తరాల్లో, విశాలమైన ప్రదేశం ఉన్నా అది చాలా శుభప్రదమైనది. ఆ ఇంటిని హాయిగా కొనుక్కోవచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *