vijayawada car accident: విజయవాడలో కారు బీభత్సం.. ఇద్దరి పరిస్థితి విషమం – car hits moped in vijayawada, two hurt


విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ని ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా కృష్ణా నది వంతెనపై చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పరిధిలోని తాడేపల్లి వైపు వస్తున్న మోపెడ్‌ను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన ధాటికి బైక్‌పై ఉన్న మహిళ సహా మరో వ్యక్తి కిందపడి తీవ్రగాయాలపాలయ్యారు.

కారుని నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారును వైద్య విద్యార్థిని నడుపుతున్నట్లు సమాచారం. కారుతో ఢీకొట్టిన అనంతరం యువతి వ్యవహార శైలిపై అనుమానం రావడంతో పోలీసులు స్టేషన్ కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గాయాలపాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Also Read: మరిదితో వదిన రాసలీలలు.. భర్తకి దొరికిపోవడంతో..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *