vijayawada constable murder: ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ హత్య.. కృష్ణా జిల్లాలో దారుణం – woman constable killed by husband in krishna district


కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురయ్యారు. కట్టుకున్న భర్తే కిరాతకంగా ఉరి బిగించి చంపేశాడు. కంచికచర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నీలవేణిని ఆమె భర్త నాగశేషు కిరాతకంగా హత్య చేశాడు. గత కొద్దికాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరోమారు గొడవ జరగడంతో కోపంతో ఊగిపోయిన నాగశేషు భార్యను అమానుషంగా అంతమొందించాడు. చీరతో మెడకు ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యపై ఆరా తీశారు. ఆమె భర్త నాగశేషుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:
విజయవాడలో కారు బీభత్సం.. ఇద్దరి పరిస్థితి విషమం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *