vijayawada liquor seiz: వరిగడ్డి వామిలో మందు బాటిళ్లు.. కృష్ణా జిల్లాలో లక్షల విలువైన మద్యం పట్టివేత – 25 lakh rupees worth illegal liquor seized in krishna district


కృష్ణా జిల్లాలో భారీగా మద్యం నిల్వలు బయటపడ్డాయి. కంకిపాడులో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్దఎత్తున అక్రమ మద్యం నిల్వలను గుర్తించారు. వరిగడ్డి వామిలో దాచి ఉంచిన లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.25 లక్షల విలువైన 142 కేసుల మద్యం పట్టుబడినట్టు తెలుస్తోంది. ఒకేసారి ఇంత భారీ స్థాయిలో అక్రమ మద్యం పట్టుబడడం జిల్లాలో సంచలనం కలిగించింది.

దాడుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం అరుణాచల్‌ప్రదేశ్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. కరోనా సమయంలో అంత భారీ మొత్తంలో మద్యం బాటిళ్లు రాష్ట్రాల సరిహద్దులు దాటి ఎలా వచ్చాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార వైసీపీ నేత కనుసన్నల్లోనే అక్రమ మద్యం వ్యాపారం జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Also Read: కన్నకొడుకు ముందే తల్లిపై అత్యాచారం.. మందు తాగించి, సిగరెట్లతో కాల్చి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *