vijayawada woman sell baby: కృష్ణా: పెళ్లి కాకుండానే గర్భం.. రూ. 16 వేలకు బిడ్డను అమ్మేసి.. – vijayawada woman birth baby boy and sell for rs. 16,000


పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి బిడ్డకు జన్మనిచ్చి.. పది రోజులైనా కాకముందే రూ.16 వేలకు అమ్మేసింది. కృష్ణా జిల్లా విజయవాడ చుట్టుగుంటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చుట్టుగుంటలోని పాత ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల 7వ తేదీన యువతి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ యువతికి పెళ్లికాకపోవడంతో బిడ్డను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ మహిళ యువతిని సంప్రదించింది. పసికందును తనకు అమ్మేయాలని కోరగా.. రూ. 16 వేలకు విక్రయించేందుకు యువతి అంగీకరించింది. దీంతో ఈ నెల 17న ఆ యువతి ఇంటికి వెళ్లిన మహిళ రూ.16 వేలు చెల్లించి పసికందును తీసుకుంది. దీంతో సదరు మహిళ బిడ్డను తీసుకెళ్లి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తమ బంధువులకు అప్పగించింది.

samayam telugu

యువతి అమ్మేసిన పసిబిడ్డ

గుట్టు బయటపడిందిలా..
గర్భవతిగా ఉన్న సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు యువతికి రోజూ పౌష్టికాహారం అందించేవారు. బిడ్డను ప్రసవించి ఇంటికి తిరిగి వచ్చాక ఈ నెల 20న అంగన్‌వాడీ కార్యకర్తలు ఆమె ఇంటికి వెళ్లి యోగక్షేమాలు విచారించారు. అయితే తల్లి దగ్గర బిడ్డ లేకపోవటాన్ని గమనించి ప్రశ్నించగా.. పుట్టిన మగబిడ్డ చనిపోయాడని చెప్పింది. వారికి అనుమానం వచ్చి ఉన్నధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు యువతిని విచారించగా బిడ్డను విక్రయించిన విషయం చెప్పేసింది. దీంతో ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *